ఈసారి రికార్డులే అంట!!

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో రెండు సూపర్ హిట్స్ రావడంతో ఇపుడు తెరకెక్కుతున్న చిత్రంపై కూడా అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించిన ఏ విషయమూ బయటికి పొక్కకుండా చిత్ర యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్లో ఒక ప్రత్యేకమైన సెట్ లో జరుగుతుంది.

షూటింగ్ నిర్విరామంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే పవన్ – త్రివిక్రమ్ సినిమాకి విపర్రీతమైన క్రేజ్ రావడమే కాకుండా బిజినెస్ కూడా క్రేజీ లెవల్లో జరిగిపోతోందని అంటున్నారు. ఈ బిజినెస్ తో పవన్ చిత్రం టాలీవుడ్ లో ఒక బెంచ్ మార్క్ ని సృష్టిస్తుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ – పవన్ చిత్రానికి ఒక్క కోస్తా జిల్లాలలోనే 50 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి బిజినెస్ పరంగా 110 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఇండియా మొత్తమ్మీద… సాటిలైట్ హక్కులు, ఓవర్సీస్ మార్కెట్స్ పరంగా పవన్ కొత్త చిత్రం 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినా ఆశ్చర్య పోవక్కర్లేదని చెబుతున్నారు. మరి పవన్ గత చిత్రం కాటమరాయుడు ప్లాపయినప్పటికీ ఇప్పుడు పవన్ తాజా చిత్రం పై దాని ఛాయలు పడకపోవడానికి పవన్ కున్న క్రేజ్, అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ వంటివి ఈచిత్రానికి ప్లస్ లుగా చెబుతున్నారు. ఎనీ హౌ పవన్ ఈ చిత్రంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతాడనే విషయం మీద మాత్రం ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*