ఈ అమ్మాయి పిడుగా?

సింగల్ నైట్ స్టార్ అయ్యారు అని వినటమే కానీ ఎప్పుడు చూడలేదు. తన క్యూట్ అండ్ లవ్లీ ఎక్స్ప్రెషన్స్ తో ఒక్క రోజే ఆరు లక్షలు మంది ఫాలోయర్స్ ని సంపాదించుకుంది ప్రియ ప్రకాష్ వారియర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఆమె గురించే అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి సృష్టించిన అలజడి అంత ఇంత కాదు.

వన్ అఫ్ ది హీరోయిన్ గా ఈమె నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు ఆ చిత్ర టీమ్ వాళ్ళు. ఆ అమ్మాయిని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా చేస్తూ సినిమా ప్రమోషన్లను కూడా మొదలెట్టారు. ప్రియ ప్రకాష్ వారియర్ ను బేస్ చేసుకుని రాత్రి ఓ టీజర్ కూడా కట్ చేసి రిలీజ్ చేసారు.తన రెండు వేళ్ళతో పెదాల నుండి ఒక కిస్సును బయటకు లాగి.. దానిని తుపాకీలాంటి తన వేళ్ళలో బుల్లెట్టు తరహాలో లోడ్ చేసి.. కుర్ర హీరో రోషన్ అబ్దుల్ పైకి పేల్చింది. ఇంకేముంది ఆ కుర్రోడు సిగ్గు పడి మురిసిపోయినట్టు అందరు సిగ్గు పడుతూ మురిసిపోతున్నారు.

ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒమార్ లులు దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఇప్పుడు ప్రమోషన్లతో పెద్దగా పనిలేదేమో. ఈ సెన్సేషల్ అమ్మాయి కారణంగా అన్ని బాషల్లోనూ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినా.. బాహుబలి రేంజ్ ఓపెనింగులు వచ్చేలా కనబడుతున్నాయంటూ సోషల్ మీడియాలో యూత్ ఒకటే హడావిడి చేస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1