ఈ హీరోయిన్ కి మొదటి దెబ్బ పడింది!!

రాజా ది గ్రేట్ సినిమా వరకు మెహ్రీన్ కి ఎదురు లేకుండా పోయింది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ వరుస విజయాలతో అమ్మడుకి తిరుగు లేదనుకున్నారు జనాలు. కానీ సందీప్ కిషన్ తో నటించిన కేరాఫ్ సూర్య తో మెహ్రీన్ కౌర్ నిజంగానే కేరాఫ్ అయ్యేలా కనబడుతుంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలు విడుదల చేసిన మెహ్రీన్ తన నాలుగో సినిమా జవాన్ ని కూడా ఈ ఏడాదే బాక్సాఫీస్ బరిలోకి దింపాలనుకుంటుంది. అయితే ప్రస్తుతం అమ్మడు కేరాఫ్ సూర్య ఫలితంతో కాస్త దిగాలుగా ఉంది. ఎందుకంటే కేరాఫ్ సూర్య నెగెటివ్ రివ్యూస్ లో మెహ్రీన్ ని ఏకి పారేశారు రివ్యూ రైటర్స్.

పాత్రకు గుర్తింపు ఏదీ?

ఆ సినిమాలో మెహ్రీన్ పాత్రకు అస్సలు గుర్తింపు లేదు. అసలు ఆ సినిమాలో మెహ్రీన్ ఉన్నా ఒకటే… లేకున్నా ఒకటే. అంతలా వుంది ఆమె పాత్ర. అసలే సినిమా నిడివి ఎక్కువ ఉండడంతో సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చి కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయని మేకర్స్ తెగ ఫీలవుతుంటే…. మధ్యలో మెహ్రీన్ గోల వచ్చి పడింది. అందుకే మేకర్స్ కేరాఫ్ సూర్యలోని కొన్ని సన్నివేశాలను తొలగించేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ సన్నివేశాల్లో మెహ్రీన్ కౌర్ కి సంబందించిన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మెహ్రీన్ క్యూటీ లుక్స్ తో బాగానే ఉన్నప్పటికీ…. సినిమా కాన్సెప్ట్ ను కొన్ని సన్నివేశాలు పక్కదారి పట్టించడమే కాకుండా.. కథనంలో గ్రిప్ లేకుండా చేస్తున్నాయనే కామెంట్స్ కారణంగానే.. వీటిని తొలగిస్తున్నట్లు కేరాఫ్ దర్శకుడు సుశీంద్రన్ చెబుతున్నాడు.

పాపం… మెహరీన్….

పాపం మెహెరీన్ కి మొదటి దెబ్బ కేరాఫ్ సూర్య తో తగిలింది. ఇక రెండో దెబ్బ కూడా జవాన్ సినిమాతో పడబోతుందనే టాక్ ఉంది. జవాన్ లో మెహ్రీన్ ఎంతగా అందాలు ఆరబోసినా… సినిమా ఇప్పటివరకు వాయిదాల మీద వాయిదాలు పడి.. చివరికి ప్రేక్షకుల్లో ఆసక్తి పోవడంతో.. ఈ సినిమాపై అంచనాలేవీ ఏర్పడేలా లేవంటున్నారు సినీ ప్రియులు. చూద్దాం జవాన్ తో మెహ్రీన్ ఎలాంటి పేరు సంపాదించబోతుందో అనేది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1