ఎంత ప్రేమ కురిపిస్తాడో…!!

మహేష్ బాబు కెరీర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అటు ఫ్యామిలీ కూడా అంటే ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందుకే సినిమాల షూటింగ్ కి బ్రేక్ వచ్చినప్పుడల్లా పిల్లల్ని తీసుకుని జాలీ గా ట్రిప్స్ కి వెళుతుంటాడు మహేష్. ఈ విషయం అందరికి తెలిసిందే. తన భార్య ని పిల్లల్ని మహేష్ ఎంతగా ప్రేమిస్తాడో… అనే విషయం ఎప్పటికపుడు బహిర్గతం అవుతూనే వుంది. ఇక నమ్రతకి గాని పిల్లలికి గాని మహేష్ మీద ఎటువంటి కంప్లైంటూ ఉండదు. అయితే జూన్ 18 న ఫాథర్స్ డే సందర్భంగా మహేష్ గురించి పిల్లల గురించి నమ్రత కొన్ని ఆసక్తికర విషయాలను చెబుతుంది.

మహేష్ ఒక గ్రేట్ ఫాదర్ అని…. అలాగే తనకు మంచి భర్త కూడా అని చెబుతుంది. తాను గౌతమ్, సితార విషయంలో చాలా స్ట్రిట్ గా ఉంటానని….. కానీ మహేష్ మాత్రం వాళ్ళకి చాలా స్వేచ్ఛనిస్తాడని చెబుతుంది. అలాగే మహేష్ పిల్లలు ఏది అడిగిన కాదు లేదు అనకుండా…… వారికేం కావాలన్నా నిమిషాల్లో అమర్చేస్తాడని… ఒకవేళ మహేష్ కి కుదరకపోయిన నా ద్వారా పిల్లలకు అన్ని సమకూరుస్తాడని… చదువు విషయంలో నేను కాస్త సీరియస్ గా ఉంటానని…. కానీ మహేష్ అలాకాదు మీకు స్కూల్ కి వెళ్లడం ఇష్టంలేకపోతే మానెయ్యండి అని ఈజిగా చెప్పేసి వారిని ఆడేసుకోమంటాడు అని అంటుంది.

కానీ ప్రోగ్రెస్ కార్డులు విషయంలో, వాళ్ళు ఎలా చదువుతున్నారో మహేష్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాడని…. ఇక స్కూల్లో పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ కి మాత్రం మహేష్ పెద్దగా అటెండ్ కాడని కానీ.. గౌతమ్ కుదరదు రావాల్సిందే అంటే మాత్రం మహేష్ వస్తాడని చెబుతుంది. ఇక సితార అల్లరిని మహేష్ ఎంతో ఎంజాయ్ చేస్తాడని…. సితార అన్నా, గౌతమ్ అన్నా ఒకేలా మహేష్ ప్రేమ కురిపిస్తాడని చెబుతుంది. అయితే మహేష్ కి పిల్లలు మమ్మీ, డాడీ అనడం ఇష్టముండదట. వాళ్లతో అమ్మ నాన్నలు అని పిలిపించుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతాడట. అందుకే ఫస్టునుండి మా పిల్లలకు అమ్మ, నాన్న అని పిలవడం అలవాటు చేశాం అంటూ చెప్పుకొచ్చింది నమ్రత.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1