ఎందుకు తగ్గాలంటున్నాడు

రవితేజ లాంగ్ గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ సినిమా హిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజా ది గ్రేట్ వంటి సినిమాతో వచ్చి కామెడీ పువ్వుల్ని పూయించాడు. కామెడీ ఎంటర్‌ టైనర్‌గా హిట్ అయిన ఈ సినిమాకి పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా అనుకున్నప్పుడే రవితేజ… తన రెమ్యునరేషన్ విషయంలో నిర్మాత దిల్ రాజు దగ్గర గట్టిగా ఉన్నాడనే టాక్ ఉంది. అసలు రాజా ది గ్రేట్ ముందు వరకు రవితేజ కి అస్సలు మార్కెట్ లేదు.

ఎందుకంటే రవితేజ అప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నాడు. అందుకే దిల్ రాజు తన పారితోషకాన్ని కొంచెం తగ్గించుకోమని.. రవితేజని ఫోర్స్ చేసి అడిగినా తగ్గకపోయేసరికి… చేసేది లేక దిల్ రాజే దిగొచ్చి రవితేజ అనుకున్న పారితోషకాన్ని ముట్టజెప్పడంతోనే రాజా ది గ్రేట్ పట్టాలెక్కింది. అయితే ఇప్పుడు హిట్ వచ్చింది కాబట్టి రవితేజ తన పారితోషకాన్ని ఇంకా పెంచేసాడట. రేటు విషయంలో రవితేజ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో రవితేజ హీరో గా సినిమాలు చేద్దామని వచ్చిన నిర్మాతలు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు అని టాక్ వినబడుతుంది.

అందులో భాగంగానే కోలీవుడ్ హిట్ సినిమా అయిన బోగన్ క్యాన్సిల్ అవడమంటున్నారు. రవితేజ రేటు విషయంలో బాగా పట్టుబట్టడమే ఈ సినిమా తెలుగులో రీమేక్ అవ్వకపోవడానికి కారణమని తెలుస్తుంది. ర‌వితేజ ప్రస్తుతం టచ్ చేసి చూడు అనే సినిమాను మాత్రమే చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ సైన్ చేసిన సినిమా ఒక్క‌టి కూడా లైన్ లో లేదు. ర‌వితేజ ప్ర‌స్తుతం రూ.12 కోట్ల‌కు త‌క్కువైతే సినిమాలు ఒప్పుకునే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. ఇలా అయితే రవితేజ తో సినిమా కష్టమే అని నిర్మాతలు భావిస్తున్నారట. మొత్తానికి ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు రవితేజ ఏ తప్పు అయితే చేసాడో ఇప్పుడు మళ్ళీ అదే తప్పుని రవితేజ రిపీట్ చేస్తున్నాడని సినివర్గాలు చెవులు కోరుకుంటున్నాయి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1