ఎన్టీఆర్ ఎక్కడా తగ్గడం లేదు

ఎన్టీఆర్ Junior NTR రామాయణ

ఎన్టీఆర్ ఇపుడు వెండితెరమీదే కాదు బుల్లితెర మీద కూడా విశేషమైన అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస హిట్స్ తో వెండితెరను ఏలుతున్న ఎన్టీఆర్ మరోపక్క బిగ్ బాస్ రియాల్టీ షో తో బుల్లి తెర మీద వ్యాఖ్యాతగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. కాకపోతే బిగ్ బాస్ సీజన్ 2 కి కూడా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వస్తాడని ఎదురు చూస్తున్న ప్రేక్షకులను కాస్త నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఎన్టీఆర్ కున్న బిజీ షెడ్యూల్ కారణంగా 100 రోజులపాటు జరగబోయే బిగ్ బాస్ సీజన్ 2 చేయలేనని చెప్పడంతో బిగ్ యాజమాన్యం ఎన్టీఆర్ ప్లేస్ లోకి నేచురల్ స్టార్ ని నాని సెలెక్ట్ చేసింది.

అయితే త్రివిక్రమ్ సినిమాతోపాటు, రాజమౌళి సినిమా తో కూడా బిజీ కాబోతున్న ఎన్టీఆర్ బుల్లితెర అభిమానులకు ఏదో విధంగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్దంగానే ఉన్నాడు. బిగ్ బాస్ చెయ్యకపోయినా ఎన్టీఆర్ ఇప్పుడు మరో రకంగా బుల్లితెర మీద కనబడబోతున్నాడు. అదెలా అంటే స్టార్ టివి ఈ ఏడాది స్పోర్ట్స్ ఈవెంట్స్ తో భారీ స్థాయిలో బిజినెస్ ను ప్లాన్ చేసింది. అందులో భాగమగానే ఐపీఎల్ – ప్రో కబడ్డీ లీగ్ ల కున్న ఆదరణను క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతో స్టార్ మా వాళ్ళు ఈ రెండు క్రీడలకు సంబంధించి ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారట.

ఎన్టీఆర్ తో కలిసి స్టార్ మా చెయ్యబోయే ఈ కార్యక్రమానికి సంబందించి ప్రోమోలు కూడా రెడీ అవుతున్నాయట. ఇక అలా ప్రోమోస్ పూర్తికాగానే ఇలా ఛానల్స్ లో టెలికాస్ట్ చేస్తారట. మరి ప్రస్తుతం స్పార్స్ కి బాగా ఆదరణ ఉన్న ఈ టైం లో ఎన్టీఆర్ ఆ ఆటలను ప్రమోట్ చేస్తే ఎన్టీఆర్ రేంజ్ మరెంతో పెరిగే అవకాశం వుంది. మరి వచ్చేనెల 7 నుండి ప్రారంభం కాబోయే ఐపీఎల్ గురించి యువత ఎంతగానో ఎదురు చూస్తుంది. అలాంటిది దానికి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే మరిక ఎన్టీఆర్ కి తిరుగుండదు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*