ఏమిటీ వింత!!

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్స్ పరంగా అధ్బుథాలు సృష్టిస్తున్న ఈ చిత్ర విజయానికి బాలకృష్ణ  చాలా సంతోషంగా వున్నాడు. తెలుగువారి ఆత్మగౌరవాన్నిచాటి చెప్పిన ‘గౌతమీపుత్ర…’ చిత్రాన్ని  అంతా ఆదరిస్తున్నారని ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంకా తనకి సిక్స్ ప్యాక్ వంటివి ఈ వయసులో నప్పవని….. అలా చొక్కాలిప్పి బాడీ ని చూపిస్తూ రొమాన్స్ చేసే కథలు తన వయసుకు తగవని చెప్పాడు.

ఇంకా అయన కొడుకు మోక్షజ్ఞ సినీఎంట్రీ గురించి మాట్లాడుతూ…. మా మోక్షు త్వరలోనే సినీ అరంగేట్రం చేస్తాడని తెలిపాడు. అయితే తాను నటించబోయే మొదటి చిత్రం ‘ఆదిత్య 999 ‘ అవుతుందని…. అయితే ఈ ‘ఆదిత్య 999  ‘కి తాను కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టే సూచనలున్నాయని తెలిపాడు. అంటే ఇప్పటివరకు ఎప్పుడూ దర్శకత్వం గురించి మాట్లాడని బాలయ్య మొదటిసారి తన కొడుకు కోసం డైరెక్టర్ గా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదని హింట్ ఇచ్చేసాడు. మరి ఏ దర్శకుడికైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తాడా? లేక తానే పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపడతాడా? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*