ఒక్కసారే బుక్ అయిపోయిందట!!

మలయాళం ‘ప్రేమమ్’ లో అద్భుతమైన నటన కనబర్చి అందరి ప్రశంశలు అందుకున్న సాయి పల్లవికి ఒకే ఒక్కదెబ్బకి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఈ దెబ్బతో సాయి పల్లవి టాలీవుడ్ లో, కోలీవుడ్ లో బాగా బిజీ అవుతుంది అనుకున్నారు. కానీ సాయి పల్లవికి ఊహించిన అవకాశాలు రాలేదు. కానీ తెలుగులో శేఖర్ కమ్ముల వంటి డైరెక్టర్ చేతికి చిక్కింది కూడా నిర్మాత దిల్ రాజు వల్లేనట. నిర్మాత దిల్ రాజు ‘ఫిదా’ చిత్రంలో వరుణ్ కి జోడిగా సాయి పల్లవిని ప్రిఫర్ చెయ్యడంతో సాయి పల్లవి నటన తెలుగు తెరకు పరిచయమవుతుంది. ఇక సూపర్ టాలెంటెడ్ అయిన సాయి పల్లవి ‘ఫిదా’ లో ఓన్ గా డబ్బింగ్ కూడా చెప్పేసుకుని ఔరా అనిపించుకుంది.

అయితే సాయి పల్లవి తర్వాత తెలుగులో నాని హీరోగా దిల్ రాజు నిర్మించే ‘మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసిఏ)’ చిత్రంలో నటిస్తుంది.అయితే ఒకేసారి మూడు సినిమాల్లో నటించేందుకుగాను సాయి పల్లవిని దిల్ రాజు బుక్ చేసాడట. అయితే ఒకేసారి బుక్ చేసిన దిల్ రాజు ఆమెకు ఒకేసారి మూడు సినిమాలకు కలిపి సింగల్ పేమెంట్ కట్టేసాడట. మరి దిల్ రాజు, సాయి పల్లవిని ఒకేసారి మూడు సినిమాలకు బుక్ చేసుకోవడం టాలీవుడ్ లో విశేషంగా చెప్పుకుంటున్నారు.

అయితే దిల్ రాజు ఆమెతో ఫస్ట్ సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ‘ఫిదా’ చేస్తుండగా.. రెండో చిత్రం నాని హీరోగా ‘ఎంసీఏ’ లో నటిస్తుంది. ఇక దిల్ రాజు నిర్మాతగా సాయి పల్లవి తన మూడో ప్రాజెక్ట్ ని చెయ్యడానికి రెడీగా ఉందట. దిల్ రాజు నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల, సతీష్ వేగేశ్న, దశరథ్ లలో ఎవరో ఒకరు డైరెక్టర్ చేసే చిత్రంలో సాయి పల్లవి నటిస్తుందని అంటున్నారు. ఆ ముగ్గురు దగ్గర వున్న కథలు దిల్ రాజుకి నచ్చడంతో వారిలో ఎవరో ఒకరితో సినిమాని నిర్మించేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నాడట. అదండి విషయం సాయి పల్లవికి ఒకేసారి మూడు సినిమాల్లో ఆఫర్ ఇచ్చింది టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు అన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1