కలెక్షన్స్ గురించి స్టార్ డైరెక్టర్ ఇలా!

స్టార్ డైరెక్టర్స్ తో కొరటాల శివ తీసిన సినిమాలు మూడు సూపర్ హిట్ అయ్యాయి. మూడు సినిమాలు ఆ హీరోస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఘనత కొరటాల సొంతం. సినిమా కలెక్షన్స్ విషయంలో డైరెక్టర్ కు సంబంధం లేదంటే తానూ ఒప్పుకోను అని అంటున్నాడు డైరెక్టర్ కొరటాల.

లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ కొరటాల కలెక్షన్స్ గురించి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. కలెక్షన్స్ అనేవి సినిమాలో భాగమే సినిమాకు ఎంత పెట్టారు.. ఎంత తిరిగివస్తుంది అనేది తెలియాలి. 50 కోట్లు పెట్టి సినిమా తీస్తే 60 కోట్లు వస్తే చాలా సంతోషం. అలాగని ప్రొడ్యూసర్స్ మాత్రమే హ్యాపీగా ఉండాలని కోరుకోము. ప్రొడ్యూసర్స్ నుండి సినిమాను కొన్న బయ్యర్ కు మిగిలిందా లేదా అనే టెన్షన్ మొదలవుతుంది. వాళ్లు కూడా సేఫ్ అయితే చాలా సంతోషం.

అలానే ఆ తర్వాత ఎగ్జిబిటర్ల గురించి ఆలోచిస్తాం. సినిమా చివరగా ఎవరి దగ్గరికి చేరిందో వాళ్లు కూడా సేఫ్ అయితే అప్పుడే నేను హాలిడే మూడ్ లోకి వెళ్తాను. ఏ డైరెక్టర్ ఐన తన బాధ్యత ప్రకారం సినిమాకు ఎంత లాభం వచ్చిందో ఎంత పోయిందో తెలుసుకోవటం చాలా అవసరం. నా రెమ్యూనరేషన్ నాకొచ్చేసింది కదా.. మిగతా వాళ్ల సంగతి నాకెందుకు అన్నట్లు ఉండలేను’’ అని కొరటాల తెలిపాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*