కలెక్షన్స్ విషయంలో చాలా అలర్ట్ గా ఉన్నార్ట

రామ్ చరణ్ ‘ధ్రువ’ సినిమా డిసెంబర్ 9  న రిలీజ్ అయ్యి థియేటర్స్ లో దుమ్ము దులిపేస్తుంది. ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమాతో టాలీవుడ్ భారీ హిట్ అందుకుని ఈ ఏడాదిని విజయవంతంగా పూర్తిచేసిందనే చెప్పాలి. ఇక రామ్ చరణ్ కి కూడా ‘మగధీర’ తరవాత అంతటి హిట్ ఇచ్చింది ఈ ‘ధ్రువ చిత్రం’. అయితే కలెక్షన్స్ పరం గా కూడా ఈ చిత్రం బాగానే వసూలు చేసిందని చెబుతున్నారు……. కానీ ఈ విషయాన్నీ ధ్రువ నిర్మాత అయిన అల్లు అరవింద్ ఎక్కడా చెప్పడం లేదు.
ఇప్పటి వరకు వరుసగా మూడు రోజులు సెలవలు రావడం తో ‘ధ్రువ’ కి బాగా కలిసొచ్చి థియేటర్స్ అన్ని ఫుల్ గా నిండిపోతున్నాయి. అయితే కలెక్షన్స్ ని ఓపెన్ గా చెబితే ఎక్కడ ఐటి దాడులు జరుగుతాయో అన్న భయంతోనే చిత్ర యూనిట్ ఎక్కడా కలెక్షన్స్ గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడుతుందనే వార్త ఎప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక బయ్యర్స్ కూడా ‘ధ్రువ’ కి కలక్షన్స్ సరిగ్గా లేవని కలరింగ్ ఇస్తున్నారట. అయితే కలెక్షన్స్ విషయాన్ని ఎక్కడా నోరు జారొద్దని నిర్మాతే వారికి సూచించినట్లు చెబుతున్నారు. దాని వలనే బయ్యర్స్ ‘ధ్రువ’ చిత్రానికి పెద్దగా కలెక్షన్స్ లేవని ప్రచారం చేస్తున్నారట.
మరి మెగా హీరో సినిమా అందులోను చిరు కొడుకు రామ్ చరణ్ సినిమా అంటే మామూలు విషయం కాదు. అంతేకాకుండా ‘ధ్రువ’ సినిమా మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకుని రన్ అవుతుంది. ఇక వెబ్సైట్ కూడా ధ్రువ కి 3  కి తగ్గకుండా రేటింగ్స్ ఇచ్చారు. మరి ఇంత పాసిటివ్ గా వున్న ఈ సినిమా కు కలెక్షన్స్ సరిగ్గా లేవంటే ఎవరన్నా నమ్మే విషయమేనా అది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*