కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ రివ్యూ

నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. అందుకే నాని సినిమాలు యావరేజ్ గా ఉన్న హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తన యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉండటంతో జనాలు ఇరగబడి థియేటర్లకు వచ్చేస్తున్నారు. ఈమధ్యే ప్రొడ్యూసర్ అయ్యి సక్సెస్ రుచి చూసాడు నాని. ఇక కృష్ణార్జున యుద్ధం అంటూ కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసారు.

ట్రైలర్ తో సినిమా స్టోరీ ఏంటో చెప్పేసారు. ఈ సినిమాలో నాని రెండు క్యారెక్టర్స్ చేస్తున్నాడు. పల్లెటూరిలో ఉండే కృష్ణ.. సిటీ గై అర్జున్. కనిపించిన అమ్మాయికి సైట్ కొట్టి తిట్లు తినడం కృష్ణకు అలవాటు. ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించడం.. ఇటాలియన్ మాఫియాతో పెట్టుకోవడం రెండూ ఒకటే అంటాడు అర్జున్ పాత్రలోని నాని.

ఇద్దరు నానిలు ఇద్దరు హీరోయిన్స్ ని లవ్ చేస్తారు. వీరి ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా? పల్లెటూరి నాని.. సిటీ నానికి కూడా ఎలా హెల్ప్ చేశాడు.. అన్నదే సినిమా. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇది పక్క మాస్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. కృష్ణ పాత్రలో చిత్తూరు యాస.. సిటీ హీరోగా పోష్ లాంగ్వేజ్ రెండింటినీ నాని ఇరగదీసేశాడు. ఓవర్ అల్ గా ట్రైలర్ చూస్తుంటే నానికి మరో హిట్ కాయం అనిపిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*