గౌతమ్ నందా దుమ్మురేపుతున్నాడు!!

గోపీచంద్ – హన్సిక – కేథరిన్ లు నటిస్తున్న ‘గౌతమ్ నందా’ చిత్రం ఏ నెల 28 న విడుదలకు సిద్ధమవుతోంది. ‘బెంగాల్ టైగర్’ చిత్రం తర్వాత సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘గౌతమ్ నందా’ చిత్రం భారీ అంచనాలే వున్నాయి. గోపీచంద్ గత చిత్రాలతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవల్లో జరిగిన విషయం తెలిసిందే. ‘గౌతమ్ నందా’ చిత్రంలో గోపీచంద్ క్లాస్ హీరోగా చాలా స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్ అదే విషయాన్నీ చెబుతున్నాయి.

ఇక టీజర్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం నిన్న ఆదివారం ఆడియో ఫంక్షన్ ని కూడా గ్రాండ్ లెవల్లో కానిచ్చేసింది. ఇక ‘గౌతమ్ నందా’ ఆడియో సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో గోపీచంద్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని … గోపీచంద్ క్లాస్ లుక్, మాస్ లుక్ చూస్తుంటే తెలుస్తుంది. రెండు లుక్స్ లోని గోపీచంద్ అదరగొడుతున్నాడు. ఇక ‘గౌతమ్ నందా’ నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తుంటే అర్ధమవుతుంది.

ఎంతో రిచ్ గా తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్స్ అందాలు కూడా స్పెషల్ అట్రాక్షన్, హన్సిక, కేథరిన్ లు అందచందాల ఆరబోతలో బాగానే ఆకట్టుకున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్లస్ అవుతుందేమో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. సినిమాని రిచ్ గా మలచడంలో, దుబాయ్ అందాలను చూపించడంలో సౌందర్ రాజన్ తన సినిమాటోగ్రఫీ తో సక్సెస్ అయ్యదనడంలో సందేహం లేదు. ఇక గోపీచంద్ స్టయిల్, డైరెక్టర్ సంపత్ నంది డైలాగ్స్ తో ఈ ట్రయిలర్ బాగానే ఆకట్టుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1