చరణ్ సందడి మాములుగా లేదు

సుకుమార్ – రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న రంగస్థలం షూటింగ్ మొదలు పెట్టుకుని చాలా కాలం అయ్యింది. ఊరించి ఊరించి రంగస్థలం లో రామ్ చరణ్ లుక్ ని నిన్న శనివారం విడుదల చేసింది చిత్ర బృందం. సినిమా విడుదల మార్చ్ 30 అయినా కూడా ఫస్ట్ లుక్ ని ఇప్పుడు వదిలి మెగా ఫాన్స్ ని కూల్ చేశారు. ఈ రంగస్థలం లుక్ లో రామ్ చరణ్ ఊర మాస్ మాదిరి గా అదరగొట్టాడు. అలాగే రంగస్థలం లుక్ ని అలా చిత్ర బృందం విడుదల చేసిందో లేదో.. ఇలా సాంఘీక మాధ్యమాల్లో అల్లకల్లోలం సృష్టించింది. రంగస్థలం చిత్ర నటీనటులతో పాటు టెక్నీకల్ టీమ్ కూడా రంగస్థలం లుక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హంగామా చెయ్యడమే కాదు.. మెగా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చరణ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ రంగస్థలం లుక్ ని పోస్ట్ చేశారు.

రామ్ చరణ్ రంగస్థలం లుక్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ అయ్యింది. అయితే అలా ఫస్ట్ లుక్ వదిలిన కొన్ని గంటల్లోనే రంగస్థలం స్టిల్స్ కొన్ని ఇంటర్నెట్ లో ప్రత్యక్షమవడంతో.. మెగా అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా ఐపోయింది. మరి ఆ స్టిల్స్ లో 1985 నాటి పల్లెటూరి పరిస్థితులు ఎలా వుంటాయో కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నాయి. పాత కాలం మోటార్ దగ్గర సమంత పెట్రోల్ పోస్తుంటే. రామ్ చరణ్ దేవుడా కరుణించు అని ప్రార్ధించడం.. అలాగే జబర్దస్త్ మహేష్, చరణ్ పక్కనే ఉండడం.. అంతేనా రామ్ చరణ్ మొక్కజొన్నపొత్తులు తట్ట ఎత్తుకుని కనబడం దగ్గరనుండి రంగస్థలం హీరోయిన్ సమంత పల్లెటూరి కాదు కాదు పక్కా పల్లెటూరి లుక్ తో అమాయకపు మొహంతో అదరగొట్టేసింది.

మరి దర్శకుడు సుకుమార్ అలనాటి వాతావరణంతో రంగస్థలం తెరకెక్కించడం మాత్రం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. మరి అలనాటి వస్తువులతోపాటే ఆనాటి ప్రేమ కథలు, మనుషుల తీరు ఇవన్నీ కూడా చూడముచ్చటగా చూపించడానికి సుకుమార్ బాగానే కష్టపడుతున్నాడనిపిస్తుంది. ఇక చరణ్ కూడా మొదటిసారి డిఫరెంట్ గా ట్రై చేస్తున్న ఈ సినిమా లో చిట్టి బాబు పాత్రలో అదరగొట్టబోతున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1