చిరు చిన్నకూతురు పెళ్లి ఎక్కడో తెలుసా

ప్రస్తుతం మెగా వారింట్లో ఆనందాలు వెళ్లి విరుస్తున్నాయి. దానికి కారణం ఏమిటో మీకు ఈపాటికే అర్థం అయి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రిజ వివాహం కళ్యాణ్ తో జరుగుతుంది. వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అవ్వడమే కాకుండాఎక్కడ జరపాలో కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మార్చ్ 28న వీరి పెళ్లి ఘనంగా జరపడానికి మెగా ఫ్యామిలీ ఫిక్స్ అయ్యింది. ఈ పెళ్లి హైదరాబాద్ లో జరుగుతుందని అనుకున్నారు, ఆ తరువాత ఈ వేన్యు తిరుపతికి కూడా మారింది. తిరుపతి లో చేయాలనీ అనుకుని చివరికి వీరి పెళ్లి రాజస్తాన్ కు షిఫ్ట్ అయ్యింది? ఎందుకంటే ఈ మద్య డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ ఎక్కువగా పాపులర్ అవ్వడం తో అలా చేస్తే కొత్తగా ఉంటుందని అదే ఫాలో అవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. రాజస్తాన్ లోని జైపూర్ లో ఈ వివాహ వేడుక జరగనుంది. ఓ వైపు మెగా అభిమానులు ఆనందంగా ఉన్నా మరో వైపు కాస్త నిరాశగానే ఉన్నట్టున్నారు . ఎందుకంటే పెళ్లి ఇక్కడ జరిగితే వేల్లోచ్చనే ఉద్దేశం. అయితే వారికోసం హైదరాబాద్ లో గ్రాండ్ రిసిప్షన్ ఏర్పాటు చేస్తారట మరి !!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*