చిరు టైటిల్ నాలుగక్షరాలేనా..?

చిరంజీవి 151 వ సినిమాగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రాన్ని చేస్తున్నట్లు గతంలో ఎప్పుడో ప్రకటించాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా అనౌన్సమెంట్ కు ముందే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ గా టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఈ చిత్రం టైటిల్ మారుస్తున్నారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అలా టైటిల్ ఎందుకు మారుస్తున్నారో కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అంటే కేవలం తెలుగుకు మాత్రమే పరిచాయమున్నపేరు. కానీ ఉయ్యాలవాడని నాలుగు భషాల్లో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలకు కలిపి ఒకే టైటిల్ ని పెట్టాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందంటున్నారు. అదులో భాగంగానే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ టైటిల్ ని ‘మహావీర’ గా మార్చినట్లు న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. నిజంగానే చిరంజీవి 151 వ చిత్రానికి ‘మహావీర’ టైటిల్ ని ఫిక్స్ చేస్తే అది అదుర్స్ అంటూ అప్పుడే మెగా ఫాన్స్ సంబరపడిపోతున్నారు.

‘మహావీర’ అనే టైటిల్ ఇటు తెలుగుకి, అటు తమిళం, హిందీ భాషలకు కరెక్ట్ గా సూట్ అవుతుందనే ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు అంతా. ఇంకా ‘మహావీర’ అంటే వీరత్వానికి ప్రతీక కాబట్టి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని అందుకే ఫైనల్ గా అదే టైటిల్ కి చిత్ర యూనిట్ కూడా కనెక్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1