చై కి, వెంకీ కి హీరోయిన్స్ ని సెట్ చేసిన దర్శకుడు!

venkatesh back to form with f2

జై లవ కుశ సినిమా తర్వాత భారీ గ్యాప్ తో సురేష్ ప్రొడక్షన్స్ లో దర్శకుడు బాబీ రియల్ లైఫ్ లో మామ, అల్లుళ్లయిన వేంకటేష్, నాగ చైతన్య లతో ఒక భారీ మల్టీస్టారర్ చెయ్యబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్న బాబీ.. వెంకీ, చైతు ల కోసం హీరోయిన్స్ తో పాటు ఆ సినిమాలో నటించే  మిగతా నటీనటుల ఎంపికను చేపట్టాడు. ఇక వెంకటేష్, నాగ చైతన్య ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే బాబీ సినిమా కోసం రెడీ అవుతారు. అయితే ఇప్పుడు వెంకటేష్ కి నాగ చైతన్య కి దర్శకుడు బాబీ హీరోయిన్స్  ఎంపికని పూర్తి చేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

హిట్ కాంబోలతోనే మళ్లీ…

ఇంతకుముందు లక్ష్మి, తులసి, బాబు బంగారం వంటి సినిమాల్తో జోడిగా నటించిన  నయనతార న వెంకటేష్ కోసం, గత ఏడాది రారండోయ్ వేడుక చూద్దాం అంటూ హిట్ కొట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ని నాగ చైతన్య కోసం బాబీ ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. మరి వెంకీ, నయనతార  కాంబో అంటే క్రేజ్ ఉంటుంది. అలాగే ఒకేసారి భారీ హిట్ కొట్టిన చైతు, రకుల్ జోడికి కూడా క్రేజ్ వస్తుంది. అందుకే బాబీ ఇలా నయన్ ని వెంకీ కోసం, రకుల్ ని చైతు కోసం సెలెక్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే నయనతారను, రకుల్ ప్రీత్ ని బాబీ ఈ మల్టీస్టారర్ విషయమై సంప్రదించాడట.

ఇంకా ఓకే చెప్పని నయన్…

అయితే ఇంకా నయనతార వెంకీ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే నాగ చైతన్య పక్కన మాత్రం నటించడానికి రకుల్ ప్రీత్ సుముఖంగా ఉన్నట్లుగా  వార్తలొస్తున్నాయి. ఎలాగూ స్టార్ హీరోలతో అని చూడకుండా రకుల్ అందరితో కలిసి నటించేస్తుంది. ప్రస్తుతానికి రకుల్ కి తెలుగులో మంచి ఆఫర్స్ కూడా లేవు. ఇలాంటి సమయంలో చైతు పక్కన ఛాన్స్ అంటే రకుల్ వెంటనే ఒప్పుకోవడం ఖాయమంటున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*