టైటిల్ సాంగ్ అదిరిందిగా ..!

తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ చేస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ సినిమాలో మొదటి సాంగ్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ‘విరచిస్తా నేడే నవశకం-నినదిస్తా నిత్యం జనహితం” అంటూ సాగే ఈ పాట తన చక్కని పదాలతో రామజోగయ్య శాస్త్రి రాసారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు చాలా క్లాసికల్ గా ట్యూన్ ఇచ్చాడు.

‘భరత్ అను నేను హామీ ఇస్తున్నాను’ అంటూ పాట ఆద్యంతం డేవిడ్ సైమోన్ గొంతులో చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఖైది నెంబర్ 150 లో నీరు నీరు పాట ద్వారా ఎమోషనల్ గా టచ్ చేసిన రామజోగయ్య శాస్త్రి మరోసారి అలాంటి ఘనత ఈ పాటతో సాదిస్తారు అనిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్.. దేవి ట్యూన్..డేవిడ్ సైమోన్ గొంతు.. ఈ పాటను వేరే స్థాయికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది.

మెలోడీగా సాగే ఈ పాట సినిమాలో ఓ కీలకా సన్నివేశం వస్తుందని అంటున్నారు. మొత్తానికి భరత్ విజన్ అంటూ వదిలిన మొదటి పాట అంచనాలు నిలబెట్టుకునేలా ఉంది అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ వరల్డ్ రికార్డు ను క్రియేట్ చేసింది. ఇక మరి ఈ సాంగ్ ఏ రికార్డు ను క్రియేట్ చేస్తుందో చూడాలి.