తన ఇమేజ్ కి భంగం కలగకుండా ఒప్పందం

సినిమా లలో ఒక సారి హిట్ పెయిర్ గా నిలిచిన హీరో-హీరోయిన్స్ కాంబినేషన్ ని మళ్లీ మళ్లీ చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు. సినిమా పుట్టినప్పటి నుండి కొనసాగుతున్న ఒరవడి. తెలుగు లో అగ్ర హీరోలలో ఒక్కరైన నందమూరి బాల కృష్ణ తాను నటించిన 102 వ చిత్రం జై సింహ కోసం అందుకే తనతో రెండు సార్లు జత కట్టి ప్రేక్షకులని మెప్పించిన నయనతార ని పట్టుపట్టి నటింపజేశారు. సింహ, శ్రీ రామరాజ్యం తరువాత వీరి కాబినేషన్ వెండితెరపై సందడి చేయబోయే చిత్రం జై సింహ.

ఒకప్పుడు రొమాంటిక్, గ్లామరస్ పాత్రలలో నటించిన నయన్ ఇప్పుడు తమిళ, మళయాళ పరిశ్రమలలో అగ్ర హీరోల కి సమానంగా మార్కెట్ వున్న కథానాయిక. ఆమె కోసమే స్క్రిప్ట్స్ రచించబడే స్థాయికి ఎదిగిన నయన్ కొన్ని కఠినమైన షరతులతో జై సింహ చిత్ర ఒప్పందం చేసుకుందట. హీరో కి తనకి మధ్య రొమాంటిక్ మరియు ఇంటిమేటెడ్ సన్నివేశాలు ఉండకూడదని, తెలుగు అగ్ర కథానాయకుల చిత్రాలలో కనిపించే కమర్షియల్ డ్యూయెట్స్ లో తాను పాలుపంచుకోననే షరతులతో జై సింహాలో నటించిందట నయన్. మరి బాలయ్య-నయన్ ల కాంబినేషన్ లో కెమిస్ట్రీ ఆస్వాదించటానికి వచ్చే ప్రేక్షకులని మెప్పించటానికి దర్శకుడు కే.ఎస్.రవి కుమార్ ఎలాంటి తిప్పలు పడి వుంటారో పాపం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1