తెలుగు హీరోలను దులిపేసిన ఎస్పీ

సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం టాలివుడ్ పై మాటల తూటాలు పేల్చారు. తెలుగు  సినిమా హీరోలకు జాతీయ అవార్డులు దక్కలేదంటున్న ఫ్యాన్స్ వాళ్లెందుకు ఆ స్థాయి సినిమా తీయడం లేదో ప్రశ్నించాలన్నారు. తెలుగు హీరోలు కనీసం ఒక్క సినిమా అయినా జాతి  కోసం, భాష కోసం చేయాలన్న ఎస్పీ అటువంటి సినిమాలు ఎందుకు తీయడం లేదని ప్రశ్నించారు.

చిన్న సినిమాలకు అసలు ధియేటర్లు దొరకడం లేదని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. మిధునం లాంటి సినిమాకు ధియేటర్లు ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. పెద్ద సినిమాలు రిలీజ్ అయితే చిన్న సినిమాలను వెంటనే తీసేస్తున్నారన్నారు. ఎప్పుడూ వివాదాల జోలికి పోని ఎస్పీ తాజాగా ఇలా మాట్లాడటంతో టాలివుడ్ లో ఇది హాట్ టాపిక్ అయింది.

2 Comments on తెలుగు హీరోలను దులిపేసిన ఎస్పీ

Leave a Reply

Your email address will not be published.


*