దర్శకనిర్మాతలకు స్టార్ హీరోస్ ఫోన్ కాల్?

ఎంతో హైప్ తో అజ్ఞాతవాసి విడుదల అయ్యి నెగటివ్ టాక్ తో రన్ అవుతుంది. ఇంత భారీ ఎక్సపెక్టషన్ తో వచ్చిన సినిమాకు టాక్ సరిగా వసూల్ లేకపోవటంతో నిర్మాత, దర్శకులు కాస్త డీలా పడడం సహజం. ఇదే నిర్మాత, దర్శకుడు కాంబినేషన్ లో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఒకటి విక్టరీ వెంకటేష్ తో, ఇంకోటి ఎన్టీఆర్ తో.
అజ్ఞాతవాసి రిసల్ట్ తెలుసుకున్న వెంకటేష్, తారక్ స్వయానా నిర్మాతకు, డైరెక్టర్ కు ఫోన్ చేశారనే ప్రచారం జరుగుతుంది. విక్టరీ వెంకటేష్ నేరుగా నిర్మాత రాధా కృష్ణకు ఫోన్ చేసి సినిమా అన్నాక జయాపజయాలు కామన్, ఇవ్వని లైట్ తీసుకుని మన సబ్జెక్టు మీద దృష్టి పెట్టండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది.
మరోవైపు ఎన్టీఆర్ కూడా డైరెక్ట్ గా డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఫోన్ చేసి..మనం కచ్చితంగా హిట్ కొడుతున్నాం, మీరు బౌన్స్ బ్యాక్ అవుతారు..డోంట్ వర్రీ అని చెప్పినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమా పూర్తిగా లవ్ అండ్ ఫామిలీ సబ్జెక్టు అంట. పైగా పవన్ లాగ ఎన్టీఆర్ తో సమస్యలు, షరతులు ఉండవ్. సో సినిమా బాగానే ఉంటుందని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1