దర్శకుడికి హీరోయిన్ కి మధ్యన?

బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన క్వీన్ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే… తెలుగులో ఈ చిత్రంలో తమన్నా నటిస్తుండగా.. తమిళంలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. తెలుగు , మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఫ్రాన్స్ లో పూర్తయిన సంగతి తెలిసిందే… అయితే ఓవర్ బడ్జెట్ అవుతున్న కారణంగా…. ఈ సినిమాని మధ్యలో ఆపేసినట్లుగా ఆమద్యన న్యూస్ వచ్చింది. అయితే ఓవర్ బడ్జెట్ప్ కారణంగా క్వీన్ రీమేక్ ఆగలేదని… దానికి వేరే కారణముంది అంటున్నారు.
అయితే ఆ కారణం ఏమిటి అంటే….  తెలుగు రీమేక్ నుండి ఆ చిత్ర దర్శకుడు నీలకంఠ తప్పుకున్నాడని సమాచారం. అది కూడా  తమన్నాతో భేదాభిప్రాయాలు రావడంతోనే నీలకంఠ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడని సమాచారం. మలయాళం రీమేక్ ను నీలకంఠ దర్శకత్వం వహించనున్నాడు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తమన్నాకి దర్శకుడు నీలకంఠ కి పడకపోవడం వలెనే ఏ ఈసినిమా ఆగిపోయిందనే న్యూస్ హల్ చల్ చేస్తుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1