దిల్ రాజు కే నో చెప్పిన హీరోయిన్

టాలీవుడ్ లో హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. సినిమాల్లో అవకాశం వచ్చిన పాత్రకు ప్రాధాన్యం ఉండడం అంటే కాసింత అరుదుగా జరిగే సంఘటనే. ఈ మధ్య హీరోయిన్స్ కు టాలెంట్ చూపే అవకాశం అడపాదడపా దక్కుతోంది. అయితే.. తమిళ భామ సాయిపల్లవి మాత్రం ప్యూర్ గా ట్యాలెంట్ తోనే క్రేజ్ సంపాదించుకుంటోంది.

అయితే.. ఈమెకు కాసింత తలబిరుసు ఎక్కువ అనే కామెంట్స్ ముందు నుంచి వినిపిస్తున్నాయి. ఎంసీఏ టైంలో నానితో విభేదాలు వచ్చాయి అని టాక్ వచ్చింది. ఎంసీఏ షూటింగ్ టైంలోనే నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ లో నెక్స్ట్ మూవీ చేయాలనీ ఓ ప్రపోజల్ పంపారట. దానిని రిజెక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడీ రూమర్లపై రియాక్ట్ అయింది ప్రేమమ్ బ్యూటీ. దిల్ రాజు గారు పంపిన ప్రపోజల్ రిజెక్ట్ చేసిన మాట నిజమే కానీ..కారణం రెమ్యూనరేషన్ కాదని.. సినిమాలో తన పాత్రను మలిచిన తీరు నచ్చకనే యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసింది సాయి పల్లవి.

ఇలా పెద్ద నిర్మాత దిల్ రాజు సినిమానే రిజెక్ట్ చేసిందంటే.. టాలీవుడ్ లో ఆమెకు అంతకు మించి మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం వుండవు. దిల్ రాజుకి నష్టం ఏమి లేదు..ఈ హీరోయిన్ కాకపోతే మరో హీరోయిన్ నటించేందుకు సిద్ధంగానే ఉంటుంది. ఆ చిత్ర కథను.. హీరోయిన్ రోల్ ను తక్కువ చేసి మాట్లాడ్డం సరికాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1