దిల్ రాజు బ్యానర్ల లో చాన్నాళ్లకు నితిన్?

స్టార్ రైటర్ సతీష్ వేగేశ్న 2008లో ‘దొంగల బండి’ చిత్రంతో దర్శకుడయ్యాడు. ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత తీసిన ‘రామదండు’ చిత్రం కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. అయినా కూడా దిల్ రాజు అతడు చెప్పిన కథ మీద నమ్మకంతో ‘శతమానం భవతి’ అప్పగించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ చిత్రం దిల్ రాజుకు ఏకంగా జాతీయ అవార్డు సాధించిపెట్టింది. ఆ చిత్రం ఇచ్చిన హిట్ తో మరోమారు దిల్ రాజు – సతీష్ వేగేశ్న లు కలవబోతున్నారు.

శ్రీనివాస కల్యాణం….

వీరి కలయికలో తెరకెక్కబోతున్న ఆ చిత్రానికి ‘శ్రీనివాస కళ్యాణం’ అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించాడు. ఫామిలీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కథానాయకుడిగా నితిన్ ఎంపికైనట్టు సమాచారం. ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నితిన్ ఈ సంవత్సరం ‘లై’ చిత్రంతో వచ్చినా ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. నితిన్ ప్రస్తుతం ‘దిల్ వాలా’ చిత్రంలో నటిస్తున్నాడు. కృష్ణ చైతన్య ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకం పై పవన్ కళ్యాణ్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆ చిత్రం తరువాత నితిన్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించనున్నాడు. మరి దిల్ రాజు బ్యానర్ లో గతంలో ఎప్పుడో.. దిల్ లో నటించిన నితిన్ ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకు రాజుగారి బ్యానర్ లో నటించబోతున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1