దెబ్బకి దారికొచ్చింది!!

samantha movie title

సమంతకి టాలీవుడ్ లో పట్టు పూర్తిగా పోయింది. అసలు ఒక్క తెలుగు సినిమా కూడా చెయ్యకుండా కాలం గడుపుతూ… కాబోయే భర్త నాగ చైతన్యతో చెట్టాపట్టాలేసుకుని విదేశాలకిట్రిప్పుల మీద ట్రిప్పులేస్తోంది. అయితే సమంతకి అక్కినేని కోడలు అవుతుందన్న కారణంగానో లేక మారేదన్నా కారణంగానో ఆమెకు అవకాశాలు మాత్రం పూర్తిగా పోయాయి. అయితే తమిళంలో మాత్రం రెండు మూడు సినిమాలతో బిజీగా వున్న సమంతకి టాలీవుడ్ మాత్రం హ్యాండ్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే సమంతే వచ్చిన ఆఫర్స్ ని తిరస్కరిస్తూ వస్తుందనే గాలి వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అయితే ఇప్పుడు తెలుగులో హీరోయిన్ ఆఫర్స్ కంటే సపోర్టింగ్ రోల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందనే వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో తెగ హల్ చల్ చేస్తుంది. హీరోయిన్ కంటే సపోర్టింగ్ రోల్ నే సమంత ఎక్కువ లైక్ చేస్తుందని అంటున్నారు. ఇక ఆ సపోర్టింగ్ రోల్ కోసం తన రెమ్యునరేష్ ని తగ్గించుకోవడానికి కూడా రెడీ అయ్యిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సమంత సావిత్రి బయో పిక్…. ‘మహానటి’ చిత్రంలో హీరోయిన్ గా కాకుండా ఒక ముఖ్య పాత్రకి ఇప్పటికే ఒప్పుకుందనే విషయం తెలిసిందే. అందుకే సమంత టాలీవుడ్ లో మంచి రొలెస్ వస్తే తన పేమెంట్ తగ్గించుకోవడానికి రెడీ అయ్యిందట.

మరి చేసిన త్యాగానికి ఫలితంగా ఆమె కోరుకున్నట్టే హీరోయిన్ గా కాకుండా మంచి పాత్రలేమైనా సమంత తలుపు తడతాయో లేక నాగార్జున కోడలితో మనకెందుకులే అని గమ్మునుంటారో చూద్దాం. అయితే సమంత అసలు ఇలా ఎందుకు నిర్ణయం తీసుకుందో… అని అప్పుడే టాలీవుడ్ లో చర్చ మొదలైంది. అంటే నాగార్జున సమంత ని హీరోయిన్ గా చెయ్యొద్దన్నాడా? అలా చేస్తే అక్కినేని వారి పరువు పోతుందని చెప్పడం వలెనే సమంత ఇలాంటి డెసిషన్ తీసుకుందా?… అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*