నయనతార ఈసారి వాటికి ఒప్పుకుందట!!

చిరంజీవి 150 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చే నెలలో పట్టాలెక్కబోతుంది. ఈ చిత్రంలో చిరజీవికి జోడిగా నయనతారని అప్రోచ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. కానీ నయనతార ఈ ఆఫర్ ని హోల్డ్ లో పెట్టిందని కూడా అంటున్నారు. మరో పక్క నయనతార ఉయ్యాలవాడలో నటించనేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా అంటున్నారు. అయితే నయనతార ఉయ్యాలవాడలో నటింపచేసేందుకు డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ రంగంలోకి దిగినట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

ఇకపోతే నయనతార చిరు పక్కన ఉయ్యాలవాడలో నటించేందుకు గాను 4 నుండి 5 కోట్లు డిమాండ్ చేసిందంటున్నారు. నయనతార డిమాండ్ చేసిన వాటికి ఉయ్యాలవాడ చిత్ర యూనిట్ సానుకూలంగానే ఉందంటున్నారు. అయితే సాధారణంగా నయనతార తన సినిమాలకు రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్లవరకు తీసుకుంటుందట. అయితే ఏకకాలంలో తెలుగుతోబాటు తమిళంలోనూ తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ చిత్రాన్ని మలయాళం, హిందీలోనూ డబ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నయనతారకు 4 నుండి 5 కోట్లు చెల్లించేందుకు ఓకె చెప్పారని తెలుస్తుంది.

ఇక నయనతార చిత్రంలో నటించడంతో పాటే ఉయ్యాలవాడ ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొనడానికే ఇంత డిమాండ్ చేసిందంటున్నారు. సాధారణంగా నయనతార తాను నటించిన సినిమాల ప్రమోషన్స్ కి అస్సలు హాజరుకాదు. ఒకవేళ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గోవాలంటే ఖచ్చితంగా దానికి ఎంతో కొంత వసూలు చేస్తుందనే టాక్ ఉండనే ఉంది. ఈసారి ఉయ్యాలవాడకి ప్రమోషనల్ ఈవెంట్స్ తో పాటు కలిపి ప్యాకేజ్ గా రెమ్యునరేషన్ వసూలు చేస్తుందంటున్నారు. అయితే ఉయ్యాలవాడ చిత్రానికి చిరంజీవి ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ కింద తీసుకోవడం లేదని.. సొంత కొడుకు, హీరో రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించడమే ఇందుకు కారణమని కూడా చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1