నయనానందం అంటున్నారు

nayanathara engagement with vignesh shivan

మలయాళం నుండి వచ్చి తెలుగు, తమిళంలోనూ ఏకబిగిన సినిమాలు చేస్తూ పాతుకుపోయిన నయనతార ప్రస్తుతం సౌత్ లో సూపర్ స్టార్ మాదిరిగా ఎదిగింది. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా నయనతారకి గొప్ప పేరుంది. అత్యధిక డిమాండ్ గల భామగా నయనతార కి పేరుంది. చిన్న పెద్ద హీరోలతో జోడి కట్టే నయనతార లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కూడా పెట్టింది పేరు. నయనతార సోలోగా చేసిన సినిమా స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంటరైనప్పటినుండి ఇప్పటివరకు వన్నెతరగని అందంతో అదరగొడుతున్న నయనతార ఇప్పటికీ టాప్ హీరోయిన్నే.

అయితే నయనతార సినిమాల్లో ఎంతగా సక్సెస్ అయ్యిందో నిజ జీవితంలో మాత్రం అనేక లవ్ ఫెయిల్యూర్స్ తో ఇబ్బందులు పడింది. ఎట్టకేలకు కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో మాత్రం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం విగ్నేష్ శివన్ తో ఎప్పటినుండో కలిసుంటున్న నయనతార విగ్నేష్ ని పెళ్లాడేందుకు కూడా రెడీ గా వుంది. ఇప్పటికే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీరిద్దరూ అతి త్వరలోనే పెళ్లాడబోతున్నారని ‘ది హిందూ’ దినపత్రిక నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఎక్స్‌లెన్స్’ అవార్డును అందుకున్న నయనతార యాదృచ్చికంగా కన్ఫర్మ్ చేసేసింది.

అయితే తాను తాజాగా నటించిన కర్తవ్యం సినిమా అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను మంచి విజయం సాధించింది. అందులో భాగంగానే నయనతార ‘ది హిందూ’ దినపత్రిక నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఎక్స్‌లెన్స్’ అవార్డును కూడా దక్కించుకుంది. అయితే తన హాట్ అండ్ కూల్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే నయనతార తాజాగా పోస్ట్ చేసిన ఒక పిక్ మాత్రం అందరిని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆ ఫొటోలో నయనతార ఎంతో పద్దతి గల అమ్మాయిగా ఆకట్టుకుంటుంది. ఆ ఫోటో చూసిన నయన్ అభిమానులు మాత్రం అబ్బా నయనానందం అంటూ తెగ షేర్స్ తో పాటు అందమైన కామెంట్స్ చేస్తూ నయనతార అందాన్ని పొగిడేస్తున్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*