నాని జున్ను గాడు ఎవరో తెలుసా?

nani next movie

వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని క్రేజ్ మాములుగా లేదు. స్టార్ హీరోలకు ధీటుగా సంపాదిస్తున్న నాని ప్రస్తుతం దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ పర్సన్. ప్రస్తుతం సినిమాల్లోనే కాదు తన క్రేజ్ ని ఇప్పుడు బుల్లితెర మీదకి షిఫ్ట్ చేస్తున్నాడు. బుల్లితెర మీద ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 1 ఎంత బాగా సక్సెస్ అయ్యిందో తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన బిగ్ బాస్ ని నేచురల్ స్టార్ నాని చెయ్యబోతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 2 ని నాని వ్యాఖ్యాతగా చెయ్యబోతున్నాడు.

అయితే నాని ఇటు కెరీర్ లోనే కాదు, అటు రియల్ లైఫ్ లోను నాని తన భార్య తన కుమారుడు అర్జున్ తో కూడా ఎంజాయ్ చేస్తూ బిజీగానే ఉంటున్నాడు. అసలు నాని కి ఇదివరకు సినిమా షూటింగ్ లు, ఆఫీస్ అంటూ బిజీగా వుండే నాని ఇపుడు తన కొడుకు అర్జున్ కోసం మరికొంత టైం స్పెండ్ చెయ్యడానికి గాను షూటింగ్ కంప్లీట్ కాగానే ఇంటికెళ్ళిపోయి అర్జున్ తో ఆడుకుంటున్నట్టుగా చాలా సార్లే చెప్పాడు. తన కొడుకు బుల్లిబుల్లి అల్లరిని ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని ఎప్పటికప్పుడు చెప్పే నాని తన కొడుకు దొంగనాకొడుకు అంటున్నాడు.

నాని కొడుకు అర్జున్ (జున్ను) పుట్టి ఈ రోజు కి ఏడాది కావొస్తుంది. తన కొడుకు అర్జున్ కి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ ని తెలియజేశాడు. కారులో అర్జున్ ని ఎత్తుకుని ముద్దు చేస్తున్న ఫోటో తో పాటు ది లిటిల్ రాస్కెల్ టర్న్స్ వన్ టుడే.. దొంగా నా కొడుకు. జున్ను గాడు అంటూ ఎంతో ఆనందంగా పోస్ట్ చేసాడు నాని. మరి కేవలం సోషల్ మీడియా ద్వారానే అర్జున్ కి విషెస్ చెప్పి ఊరుకోవడం లేదు.. అర్జున్ పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా ప్లాన్ చేస్తున్నారట. మరి నాని కొడుకుని మీరు ఓ లుక్కెయ్యండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*