నా పోస్టర్స్ చూస్తుంటే డాన్సులు వేసేవాడిలా కనిపిస్తున్నానా?

మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఐన బాహుబలి ది కంక్లూషన్ ట్రైలర్ తెలుగు తోపాటు తమిళ, మళయాళ, హిందీ భాషలలో విడుదలై యూట్యూబ్ రికార్డ్స్ పై స్వారీ చేస్తుంది. మొదటి నుంచి బాహుబలి కి సంబంధించిన ఏ చిన్న వార్తయినా పెద్ద సంచలనం అవుతుంది. ప్రేక్షకులలో బాహుబలికి వున్న క్రేజ్ అది. ప్రత్యేకించి పబ్లిసిటీకి పెట్టుబడి పెట్టవలసిన పని లేకుండా బాహుబలి విశేషాలు ప్రతి చోటా ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. ఏప్రిల్ 28 న బాహుబలి ది కంక్లూషన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శాంపిల్ గా ఇప్పటికి ట్రైలర్ తో అలరిస్తున్న బాహుబలి టీం, ట్రైలర్ విడుదల అనంతరం ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, హీరో ప్రభాస్, విలన్ రానా దగ్గుబాటి పాల్గొన్న ఈ ప్రెస్ మీట్ లో పత్రికా ప్రతినిధులు ఎక్కువగా రానా దగ్గుబాటిని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగారు. బాహుబలి ది బిగినింగ్ లో రానా దగ్గుబాటి నుంచి డాన్స్ లు చూసే భాగ్యానికి ప్రేక్షకులు నోచుకోలేదు కదా, మరి బాహుబలి ది కంక్లూషన్ లోనైనా ఆ లోటు తీరుతుందా? అని అడిగిన ప్రశ్నకు రానా స్పందిస్తూ, “ఆ పోస్టర్ లో నా అవతారం చూడండి. అసలు డాన్సులు వేసేవాడిలా కనిపిస్తున్నానా? అయినా అమ్మాయిలతో పాటలు, డాన్సులు అన్ని ప్రభాస్ చేసుకుంటాడు. నేను పని మాత్రం చేస్తాను అంతే.” అంటూ తన సమాధానంలో చమత్కారం మేళవించి అందరిని నవ్వించాడు రానా దగ్గుబాటి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*