నిర్మాతగా సంపాదించి ఇప్పుడు పోగొట్టుకోనున్నాడా?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు గత ఏడాది శతమానం భవతి, నేను లోకల్, దువ్వాడ జగన్నాథం, ఫిదా, రాజా ది గ్రేట్, ఎం.సి.ఏ అంటూ ఏకంగా అరడజను చిత్రాలతో విజృంభించారు. ఈ చిత్రాలలో కొన్ని పంపిణీదారులకి బ్రేక్ ఈవెన్, కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు తీసుకు రాగా నిర్మాతగా దిల్ రాజు కి మాత్రం అన్ని టేబుల్ ప్రాఫిట్స్ సమకూర్చినవే. ఇలా వరుస లాభదాయకమైన ప్రాజెక్ట్స్ తో జోరు మీదున్న రాజు గారికి ఇప్పుడు పంపిణీదారుడిగా పెద్ద కష్టమే వచ్చింది.

పంపిణీదారుడిగా నైజామ్ ప్రాంతంలో అనేక సినిమాలు విడుదల చేసి నిర్మాతైన దిల్ రాజు ఇప్పటికి కూడా పెద్ద, చిన్న హీరోల చిత్రాలు నైజామ్ ప్రాంతంలో పంపిణీ చేస్తూనే వుంటారు. ఆయన తాజాగా విడుదలైన అజ్ఞ్యాతవాసి చిత్రాన్ని నైజామ్ ప్రాంతానికి 29 కోట్ల రూపాయల మొత్తం ఇచ్చి దక్కించుకున్నారు. ఈ ప్రాంతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలలో అత్తారింటికి దారేది వసూళ్ల పరంగా అధిక మొత్తం రాబట్టిన చిత్రం. ఆ చిత్రం 22 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు చేయగా దిల్ రాజు అజ్ఞ్యాతవాసి చిత్రాన్ని ఏకంగా 29 కోట్లకి కొనటం, ఇప్పుడు ఆ చిత్రం ఘోర పరాజయం దిశగా సాగుతుండటంతో నిర్మాతఃగా గత ఏడాది ఆర్ధిక లాభాలు చూసిన రాజు గారికి ఈ ఏడాది పంపిణీ రూపంలో ఆరంభంలో భారీ నష్టమే వాటిల్లనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1