పండగ…. పర్మిషన్ ఇవ్వండి?

డిసెంబర్ 31న అర్ధరాత్రి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా మద్యం సేవించి…. వాహనం నడిపినందుకు యాంకర్ ప్రదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రదీప్ కారుకు బ్లాక్ ఫిలిం కూడా ఉండడంతో మరో కేసు కూడా నమోదైంది. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కౌన్సిలింగ్ కి హాజరవ్వాల్సిన ప్రదీప్ ఒక మూడు రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి… సడన్ గా తాను షూటింగ్స్ తో బిజీగా వున్నానని.. తానెక్కడికి పారిపోలేదని.. లా ప్రొసీడింగ్స్ తూచా తప్పక పాటిస్తానని మరి వీడియో బైట్ మీడియాకిచ్చాడు.

అన్నట్టుగానే జనవరి 8న తన తండ్రితో కలిసి గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. అయితే జనవరి 10వ తేదీన ప్రదీప్ నాంపల్లి కోర్టుకు హాజరు కావాలి. కానీ ప్రదీప్ జనవరి 10 న కోర్టుకు హాజరు కాలేదు. అయితే ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులను కలిసిన ప్రదీప్ తండ్రి పండుగ దృష్ట్యానే ప్రదీప్ కోర్టుకు హాజరు కాలేదని, కోర్టుకు హాజరుకావడానికి కొంత సమయం గడువు ఇవ్వాలని కోరారు. ప్రదీప్ తండ్రి వినతితో ప్రదీప్ కోర్టుకు హాజరు కావడానికి పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం వరకు సమయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇకపోతే ప్రదీప్ మాచిరాజుకి డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు కారుకు బ్లాక్ ఫిలిం రెండు కేసుల్లోనూ కనీసం మూడురోజులపాటు జైలు శిక్ష విధించే అవకాశమున్నట్టు సమాచారం అందుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1