పవన్ కి ఆ డైరెక్టర్ కి మధ్య మనస్పర్థలా?

అజ్ఞాతవాసి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన త్రివిక్రమ్ మళ్ళీ ఇంతవరకు బయట కనబడడం లేదు. అజ్ఞాతవాసి సినిమా కాపీ పేస్ట్ గొడవ దగ్గర నుండి సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడం ఇలా అన్ని విషయాలతో ప్రేక్షకుల్లోనూ త్రివిక్రమ్ మీద గౌరవం తగ్గిందా… ఏమో చెప్పలేం కానీ త్రివిక్రమ్ ఇమేజ్ మాత్రం అజ్ఞాతవాసి సినిమా బాగా డ్యామేజ్ చేసింది. ఈ సినిమా వరకు ఎప్పుడు నిర్మాతలను గాని ఎవ్వరిని పట్టించుకోకుండా పనిచేసుకుపోయే త్రివిక్రమ్ కి అజ్ఞాతవాసి సినిమాతో బాగానే ఎదురు దెబ్బ తగిలింది.

పవన్ మంచి స్నేహితుడు….

ఇక త్రివిక్రమ్ కి ఎంతమంది స్నేహితులు ఇండస్ట్రీలో ఉన్నా పవన్ కళ్యాణ్ అంత గొప్ప స్నేహితుడు మాత్రం లేరు. స్నేహం ఏర్పడింది మొదలు వీరిద్దరూ కలిసి సినిమాలు చెయ్యకపోయినా ఇతరుల ఫంక్షన్స్ కి అంటే పెళ్ళిళ్ళకి నితిన్ వంటి హీరోల ఆడియో వేడుకలకి ఇద్దరు కలిసే కనిపించేవారు. ఇక త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు. పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ లేనిదే ఏం జరగదన్నట్టుగా ఉండేవాడు. అంతలాంటి స్నేహం వారి మధ్యలో ఉంది. అయితే అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ రాజకీయంగా బిజీగా ఉంటున్నాడు. ఇక త్రివిక్రమ్ అయితే ఎవరికీ కనబడకుండా ఎన్టీఆర్ తో చేసే సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అని అంటున్నారు. మరి త్రివిక్రమ్ ఇప్పుడు అస్సలు యాక్టీవ్ గా లేరు.

అక్కడ కన్పించలేదే…..

అయితే అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ మధ్య మనస్పర్థలు ఏమైనా వచ్చాయా…? అంటే క్లారిటీ లేదుగాని వచ్చాయనే అందరూ ఫిక్స్ అవుతున్నారు. ఎందుకంటే నిన్న ఆదివారం రాత్రి జరిగిన త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ శిష్యుడు అయిన నితిన్ తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో గ్రాండ్ గా పవన్ చేతుల మీదుగా జరిగింది. మరి పవన్ తో పాటే అన్నిచోట్లా కనబడే త్రివిక్రమ్ ఈ ఈవెంట్ కి మాత్రం డుమ్మా కొట్టాడు. అందులోను త్రివిక్రమ్ ఛల్ మోహన్ రంగాకి కథ కూడా అందించాడు. అలాంటిది త్రివిక్రమ్ ఈ ఈవెంట్ కి పవన్ తో కలిసి రాకుండా మానేసేసరికి అందరూ పవన్ కి త్రివిక్రమ్ కి మధ్య ఏమైనా అన్న అనుమానాలు వెలిబుచ్చుతున్నారు. మరి వారి మధ్యన నిజంగానే ఏమైనా అనే విషయం వారికే తెలియాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*