పవన్ ని ఫాలో అవుతున్న మహేష్

గత నాలుగేళ్ల నుండి చూస్తే మహేష్ బాబుకి ఒక్క ‘శ్రీమంతుడు’ తప్ప మిగిలిన సినిమాలు అన్ని డిజాస్టర్లే. ప్రస్తుతం తీస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమా మహేష్ కెరీర్ కు చాలా చాలా కీలకం కానుంది. మొదటి నుండి ఈ సినిమా సంక్రాంతికి అనుకున్నారు. కానీ ఇప్పుడు అది ఏప్రిల్ కు జారుకుంది. అయితే ఇప్పటిదాకా ఈ చిత్ర టైటిల్ ప్రకటించలేదు. భరత్ అనే నేను టైటిల్ బయటికి వచ్చినప్పటికీ అదేమీ అధికారికంగా ప్రకటించలేదు.

మహేష్ కు సంబంధించి ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు చిత్ర టీం. మరోవైపు వేసవి బరిలోనే ఉన్న ‘నా పేరు సూర్య’ ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. మొన్న జనవరి 1న రిలీజ్ చేసిన ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ కు అదిరిపోయే టాక్ వచ్చింది. కానీ మహేష్ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా ఏ ముచ్చటా లేదు.

‘అజ్ఞాతవాసి’ లాగ సినిమాకు వారం ముందు నుండి ప్రొమోషన్స్ చేద్దాం అనుకున్నాడేమో కానీ, పవన్ సినిమా వేరు, మహేష్ సినిమా వేరు. ఎందుకంటే అదే వేసవిలో ‘2.0’.. ‘నా పేరు సూర్య’.. ‘రంగస్థలం’ లాంటి సినిమాల మధ్య రాబోతోంది. అలాంటపుడు కొంచెం ముందు నుంచే ప్రమోషన్ల హోరు పెంచి బజ్ తీసుకురావడం ముఖ్యం. కానీ ఇంతవరకు షూటింగ్ అప్ డేట్స్ తప్ప ‘భరత్ అనే నేను’ సినిమా నుండి ఏ ఒక్క పోస్టర్ కానీ.. స్టిల్ కానీ బయటికి రాలేదు. మరి ప్రొమోషన్స్ గురించి మహేష్ టీం ఏ ప్లాన్ వేసిందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1