పవన్ వీరాభిమాని.. వారిని కడిగిపారేసింది?

janasena may win gajuwaka

హీరోయిన్ గా తెలుగులో చేసిన సినిమాలన్నీ ప్లాపులే. అడపాదడపా కొన్ని సినిమాలు చేసినా హీరోయిన్ గా తగిన స్టేటస్ అందుకోలేకపోయింది. కానీ హీరోయిన్ అవకాశాల కోసం రకరాకాల హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రెచ్చిపాయినా ఆమెకి తగిన అవకాశాలు మాత్రం రాలేదు. అలాంటి టైం లోనే ఏపీ ప్రభుత్వం పిలిచి చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ హోదా ఇవ్వడంతో పూనమ్ కాస్త మీడియాలో హైలెట్ అయింది. చేనేతే వస్తాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన తర్వాత పూనా కౌర్ కాస్త మీడియాలో కనబడుతూ ఉంది. అయితే ఆ మధ్యన ఒకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకి అభిమానమని.. అవకాశముంటే పవన్ ని పెళ్లి చేసుకునేంత ఇష్టముందని చెప్పి షాక్ ఇచ్చింది.

ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నవారి మీద విరుచుకుపడింది. పవన్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారిని ‘ఫ్యాట్సో’ అంటూ సంబోధిస్తూ…. వారిపై తీవ్రంగా విరుచుకుపడింది. ఒకరిని విమర్శించి డబ్బు సంపాదించుకునే వారికంటే.. బెగ్గర్స్ బెస్ట్ అని.. ఆ ఫ్యాట్సో ని రోజు మీడియాలో, ఛానల్స్ లో చూసి చూసి బోర్ కొడుతుందని…. పాపం ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారు బరువు తగ్గించుకోవడానికి డబ్బుల్లేవేమో.. డొనేట్ చెయ్యండి.

అలాగే మనమీద సెటైర్స్ వేసే వారికీ కూడా మనం తిండి పెడుతున్నాం. ఇది మాత్రం చాల గొప్ప విషయమే. అలాగే వారికి తగిన పని దొరికి త్వరగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్న అంటూ పవన్ మీద సెటైర్స్ వేసే వారిని పరోక్షంగా కడిగి పారేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*