పవిత్ర హెచ్చరిక!!

టాలీవుడ్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియా లింక్స్ తో క్షణ క్షణం ఇప్పుడు ఉత్కంఠగా మారిపోయింది. టాలీవుడ్ లో కొందరి సెలబ్రిటీస్ కి సిట్ నోటీసులు పంపడంతో మొదలైన రచ్చ కొంతమంది అరెస్ట్ లతో ఆగుతుందేమో అంటున్నారు. ఇక ఇప్పటికే 12 మందికి నోటీసు లు అందుకుకున్న వారిలో ప్రముఖంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ అండ్ క్యాంప్ ఉంది.

ఇక పూరి కూడా పరిశ్రమలోని పెద్దల పేర్లు బయటపెట్టాడంటూ ప్రచారం అవుతున్న వేళ హడావిడిగా పూరి ఒక ట్వీట్ వేసాడు. తాను ఎవరి పేర్లు చెప్పలేదని …. అసలు పైసా వసూల్ చిత్రం షూటింగ్ లో బిజీగా వున్నానని చెప్పాడు. అయితే ఇప్పుడు పూరిగారి కూతురు పవిత్ర లైన్లోకొచ్చి తన తండ్రికి డ్రగ్స్ విషయంలో ఏపాపం తెలియదని… మా నాన్న ఒక సెలెబ్రిటీ కాబట్టి… ఎవరిష్టమొచ్చినట్టు వారు ఊహించేసుకుని పుకార్లు పుట్టించడం సరికాదని…. ఆయనకంటూ ఒక కుటుంబం ఉందని, ఇలాంటివన్నీ పుట్టిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటంటూ నిలదీస్తుంది.

అసలీ అబద్దం ఎప్పుడు నిజం కాదు.మా నాన్నకి డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకంటూ ఒక టాలెంట్ వుంది. దానితో ఆయన కెరీర్ ని చక్కదిద్దుకోగలరు. ఇలా డ్రగ్స్ వ్యాపారం లాంటి ఇల్లీగల్ పనులు చెయ్యాల్సిన అవసరం లేదంటూ… ఏదన్న రాసేముందు ఒళ్ళు దగ్గర పట్టుకోమంటూ హెచ్చరిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1