పాపం….

పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంతో తెలుగులో సంగీత దర్శకుడిగా పరిచయమైన అనిరుధ్ కు ఆ చిత్ర ఫలితం బాగా నిరాశ పరిచింది. తొలి చిత్రమే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో చేసినా…. సంగీతం ఫర్వాలేదనిపించినా.. ఆ చిత్రం పరాజయం పాలవ్వడంతో అనిరుధ్ కి ఆశించినంత క్రేజ్ రాలేదనే చెప్పాలి. మొదటి సినిమాతోనే స్టార్ హీరోకి మ్యూజిక్ వాయించి తెలుగులో గ్రాండ్ గా జెండా పాతుదాంఅని తెగ హడావిడి చేసిన అనిరుధ్ కి అజ్ఞాతవాసి చేదు అనుభవమే మిగిల్చింది. అయితే అనిరుధ్ కి త్రివిక్రమ్ తాను తెరకెక్కించబోయే ఎన్టీఆర్ సినిమాలో మళ్ళీ అవకాశం ఇచ్చేవాడే. కానీ కొన్ని కారణాల వలన అనిరుధ్ ని తప్పించి ఎన్టీఆర్ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారంటున్నారు.

అసలయితే త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న తదుపరి చిత్రానికి సంగీత దర్శకుడిగా అధికారికంగానే అనిరుధ్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా ఈ ప్రాజెక్ట్ నుండి అనిరుధ్ ను తప్పించి.. ఆ అవకాశం టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కు ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. కాకపోతే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడకున్నా. ఫిలింసర్కిల్స్ కి చెందిన కొందరు మాత్రం అనిరుధ్ ని తప్పించి దేవి శ్రీ ప్రసాద్ ని ఫైనల్ చేసారని… ఇది నిజం అని అంటున్నారు. అంటే.. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ చిత్రం నుండి అనిరుధ్ నిజంగానే తప్పుకున్నాడట. మరి ఆ చాన్సు చివరికి దేవి శ్రీ ప్రసాద్ కు చిక్కింది. పాపం అనిరుధ్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1