పురస్కారాలు స్టార్ హీరోల అభిమానులని తృప్తి పరిచే వేడుకలే

తాజాగా జరిగిన ఐఫా అవార్డ్స్ వేడుక అట్టహాసంగా ప్రారంభమై అతిరథ మహారథుల సమక్షంలో వైభవంగా జరిగింది. కానీ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న పెళ్లి చూపులు చిత్రానికి మాత్రం ఈ పురస్కారాలతో అన్యాయమే జరిగింది అని చెప్పాలి. దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలి ప్రయత్నంగా చేసిన పెళ్లి చూపులు ప్రేక్షకాదరణ పొంది గత ఏడాది చిన్న సినిమాలలో మేటిగా నిలవటమే కాకుండా మధ్యస్థ రేంజ్ వున్నా కథానాయకుల సినిమాల వసూళ్లతో సమానంగా వసూళ్లు రాబట్టింది. ఎంతో గొప్ప చిత్రం అంటూ అప్పుడు పెళ్లి చూపులు చిత్రాన్ని చిత్ర బృందాన్ని చిత్ర పరిశ్రమ మొత్తం కొనియాడింది.అయితే అవార్డ్స్ విషయానికి వచ్చే సరికి మాత్రం పెళ్లి చూపులు చిత్రానికి చిన్న చూపే దక్కింది.

పెళ్లి చూపులు చిత్రంలో తన హావభావాలు, డైలాగ్ మోడ్యులేషన్ తో హాస్యం అద్భుతంగా పండించిన ప్రియదర్శి కి బెస్ట్ కమెడియన్ విభాగంలో అవార్డు దక్కటం మినాహిస్తే మరెక్కడా పెళ్లి చూపులు చిత్ర ప్రస్తావన లేకుండానే ఐఫా ముగిసింది. ఇందుకు ఆ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ హర్ట్ అయ్యాడో ఏమో సోషల్ మీడియా ద్వారా అవార్డ్స్ పై ప్రస్తావిస్తూ పెద్ద పోస్ట్ పెట్టాడు. అవార్డు వేడుకలు కేవలం స్టార్ హీరోస్ కి ఆహ్లాదం కలుగజేయటానికే తప్పితే ఇచ్చే పురస్కారాలతో నాణ్యమైన సినిమాలకి ప్రోత్సాహం అందే విధంగా జ్యూరీ పని చెయ్యటం లేదని, అయితే అవార్డు దక్కని కారణంగా తాను పంథా మార్చుకుని స్టార్స్ కోసం సినిమాలు చేయబోనని, తన శైలి లోనే మంచి కథలని వినూత్న రీతిలో చెప్పే ప్రయత్నాలే ముందు ముందు కూడా చేస్తానని చెప్తూ అవార్డ్స్ కంటే కూడా ప్రేక్షకాధరణకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తానంటూ ముగించాడు తరుణ్ భాస్కర్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*