ప్రొమోషన్స్ తో క్యూరియాసిటీ పెంచటం అంటే ఇదేనేమో

స్టార్ యాక్టర్స్ మరియు టెక్నిషియన్స్ పనిచేసిన చిత్రానికైనా పబ్లిసిటీ మరియు విడుదల ప్రణాళిక చాలా కీలకం అవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే తొలి సబ్ మెరైన్ సినిమా గా తెరకెక్కిన ఘాజి చిత్రానికి ఇప్పుడు ఇటువంటి వినూత్న ప్రచార శైలినే ఎంచుకున్నారు. ఒక వైపు రెగ్యులర్ పబ్లిసిటీ కార్యక్రమాలలో భాగంగా కథానాయకుడు రానా దగ్గుబాటి చిత్ర బృందంతో కలిసి ఇంటర్వ్యూ లలో పాల్గొంటుండగా మరో వైపు చిత్ర నిర్మాత ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించే విధంగా ఒక పోస్ట్ విడుదల చేశారు. సోషల్ మీడియా లో ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతూ నెటిజన్ల షేర్లతో అత్యధికమంది ప్రేక్షకులకు ఘాజి చిత్రం దృష్టిలో పడుతుంది.

Ghazi-Movie-Promotions-with-Different-THeme-1486291907-1756

సాధారణంగా ఆర్మీ, నేవీ వారు వారి దళాలను కాపాడుకునే క్రమంలో యుద్ధ రంగం నుంచి సందేశాలు పంపటానికి రహస్య కోడ్ లు ఉపయోగిస్తూ వారి సంభాషణను సాగిస్తారు. ఇప్పుడు ఘాజి చిత్రంలో వాడిన అటువంటి రహస్య కోడ్ నే ప్రమోషన్ కి వాడుతున్నారు. ఈ పోస్ట్ లో ఓవర్ మరియు అవుట్ ఆంగ్ల పదాలు హై లైట్ చేస్తూ సాగిన ఈ సంభాషణ లో ఓవర్ మరియు అవుట్ పదాలను కలిపి వాడకూడదు అంటూ ఒక హెచ్చరిక కూడా వుంది. పైగా ఇదే మేము మీకు పంపే ఆఖరి సందేశం, దీనికి మీ నుంచి సమాధానం కూడా అవసరం లేదు అంటూ కొన్ని కోడ్ భాషలతో సందేశం పంపారు రానా దగ్గుబాటి టీం. ఈ సందేశాన్ని డీకోడ్ చేయటం సాధ్యపడే కార్యం కాదు కాబట్టి ఆసక్తితో ప్రేక్షకులు ఘాజి చిత్రాన్ని ఒక్కసారైనా తప్పక చూసే అవకాశాలు మెండుగా వున్నాయి. ఒక్క పోస్ట్ ఎంతటి ప్రచారం కలిపిస్తుందో చూసారా?!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*