బన్నీ కెరీర్ లో ఇదొక రికార్డ్!!

ప్రస్తుతం బన్నీ నా పేరు సూర్య అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై నాగబాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ అప్పుడే ప్రారంభమైంది.

నైజాం మార్కెట్ లో….

ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణాలో నైజాం మార్కెట్ పెద్దది. అయితే ఈ ఏరియాలో సినిమాలు కొనటానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. ఏషియన్ సునీల్ ఈ మూవీ నైజాం రైట్స్ కోసం 21 కోట్ల రూపాయల డీల్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా బన్నీ ఏ సినిమా చేసినా, నైజాంలో దాని మార్కెట్ 15 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయల మధ్య పలుకుతుంది. కానీ బన్నీ నటించిన సినిమాల్లో నైజాంలో ఇంత ధర రావడం ఇదే ఫస్ట్ టైం.

ప్రీ రిలీజ్ ఫంక్షన్….

అయితే బన్నీ లాస్ట్ మూవీ డీజే సినిమాకు నైజాంలో 20 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అందుకోసమే నా పేరు సూర్య సినిమాకు 21 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది ఏషియన్ సినిమాస్ సంస్థ. మరి ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇలా వుంది. ఇక సినిమా తో ఏ రేంజ్ లో షేర్స్ కొల్లగొడతాడో బన్నీ చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1