బాగానే ఎంజాయ్ చేస్తుంది!!

నయనతార ప్రేమ, పెళ్లి విషయంలో బాగా.. క్లారిటీగా ఉంటుంది. అందుకే రెండు బ్రేకప్స్ అయినా డీలాపడకుండా మూడో లవ్ ని కూడా కంటిన్యూ చేస్తుంది. శింబు, ప్రభుదేవా వ్యవహారాలు తర్వాత నయన్ ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ తో డీప్ లవ్ లో ఉంది. ఇప్పటికే విఘ్నేష్ తో నయన్ కలిసుంటుంది కూడా. అయితే కెరీర్ పరంగా అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేని ఈ జంట తమ తమ కెరీర్ లో ముందుకు సాగుతూనే తీరిక సమయాల్లో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా ఉన్న నయనతార తెలుగు, తమిళ భాషలలో బోలెడు అవకాశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.

అమెరికాలో చక్కర్లు…..

అయితే ఎంత తీరిక లేకుండా గడిపినా కూడా తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ పుట్టినరోజుకు మాత్రం అమెరికా వెళ్లే ప్లాన్ ని జాగ్రత్తగా సెట్ చేసుకుందనుకుంటా. అందుకే ఇప్పుడు ప్రియుడు విఘ్నేష్ తో కలిసి అమెరికాలో చక్కర్లు కొడుతోంది. అయితే నయన్, విఘ్నేష్ లు అమెరికాలో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ ని బట్టి అర్ధమవుతుంది. వీరిద్దరూ కలిసి బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గర ఎంజాయ్ చేస్తున్న విషయం స్వయంగా విగ్నేష్ తన పేస్ బుక్ పేజీ లో షేర్ చేసాడు. ఇక ఈ ఫొటోలో నయనతార, విగ్నేష్ తో ఎలా ఎంజాయ్ చేస్తుందో అనేది పూర్తిగా అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే విగ్నేష్, సూర్య సినిమాని తెరకెక్కిస్తుండగా… నయన్ మాత్రం తెలుగులో ఇద్దరు సీనియర్ హీరోలతో జోడి కడుతుంది. బాలకృష్ణ – కె ఎస్ రవికుమార్ కలయికలో వస్తున్న ఒక సినిమాలోనూ….. చిరు 151 సినిమా సై రా నరసింహారెడ్డి లోను నటిస్తూ బిజీగా వుంది.