బాబు తగ్గడం లేదుగా

ప్రస్తుతం ఎక్కడ చూసిన మహేష్ ‘భరత్ అనే నేను’ గురించిన చర్చలే వినబడుతున్నాయి. నాన్ బాహుబలి రికార్డులను సృష్టిస్తున్న భరత్ మీద మహేష్ బాబు భారీ ఆశలే పెట్టుకున్నాడు. మహేష్ ఆశలను నిజం చేసిన ‘భరత్ అనే నేను’ నిజంగానే అంతః కరణ శుద్ధిగా హిట్ కొట్టేసింది. మొదటి రోజు నుండే నాన్ బాహుబలి రికార్డులని సృష్టిస్తున్న మహేష్ కి ఓవర్సీస్ లోను భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలోని చెన్నై వంటి మహానగరంలో ‘రంగస్థలం’ రికార్డులను కొట్టేసిన ‘భరత్ అనే నేను’ ఇప్పుడు ఓవర్సీస్ ఆస్ట్రేలియాలోను ఫస్ట్ డే 1.68 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టి రికార్డు సృష్టించింది.

మరి మొదటి రోజునే రికార్డు కలెక్షన్స్ ని ఆస్ట్రేలియాలో కొల్లగొట్టిన ‘భరత్ అనే నేను’ శని ఆదివారాల్లోనూ అదే జోరును కొనసాగిస్తూ బాక్సాఫీసు భరతం పట్టింది. కేవలం ఈ వీకెండ్ లో మహేష్ బాబు ఆస్ట్రేలియాలో 3.39 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టి, సౌత్ ఇండియన్ సినిమాల్లో ఓపెనింగ్స్ విషయంలో బాహుబలి తరువాత స్థానంలో నిలిచింది. ఇంతకుముందు బాహబలి రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టి మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే…మొన్నటికిమొన్న ‘రంగస్థలం’ సినిమా 2.89 లక్షల డాలర్లతో రెండో స్థానాన్ని ఆక్రమించింది.

కానీ ఇప్పుడు బాహుబలి రికార్డులను కొల్లగొట్టకపోయినా రామ్ చరణ్ ‘రంగస్థలం’ రికార్డులను మాత్రం చెడుగుడు ఆడుకుంది ‘భరత్ అనే నేను’. మరి ఈలెక్కన ఈవారం పూర్తయ్యేసరికి ‘రంగస్థలం’ రికార్డులను మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ కొల్లగొట్టేయ్యడం ఖాయం గానే కనబడుతుంది. మరి మహేష్ కి మాత్రం తనకి కావాల్సిన హిట్టు భరత్ తో పడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*