బాలయ్య కెరీర్ లోనే ఇదొక రికార్డు!!

నందమూరి బాలకృష్ణ ‘సింహ’ సినిమాకి ముందు 20 – 25 కోట్ల మార్కెట్ జరిగింది. అయితే ‘శాతకర్ణి’ సినిమా తర్వాత ఈ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ‘శాతకర్ణి’ సినిమా ఏకంగా 50 కోట్ల షేర్ చేయడంతో…. బాలయ్య కూడా 50 కోట్ల క్లబ్ లో చేరి తన స్టామినా ఏంటో నిరూపించాడు. ఈయన చేస్తున్న సినిమాల రేట్స్ కూడా భారీ గానేపలుకుతున్నాయి. అయితే ప్రస్తుతం తాను నటిస్తున్న ‘జై సింహ’ సినిమా కూడా మంచి రేట్స్ పలుకుతుంది అని టాక్. మొన్న వచ్చిన ‘పైసా వసూల్’ 46 కోట్లమేర బిజినెస్ చేయగా..ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ ‘జై సింహ’ కూడా 50 కోట్లు ప్రీ బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

గత చిత్రాలకంటే ఎక్కువగా…

అయితే ఈ సినిమా రైట్స్ కొన్ని ఏరియాస్ లో బాలయ్య గత చిత్రాలకంటే ఎక్కువ రేట్లకే అమ్ముడుపోయిందంట. ఇప్పటికే ఈస్ట్ గోదావరికి సంబంధించి ఓ డిస్ట్రిబ్యూటర్ ‘జై సింహ’ని 2.75 కోట్లకి కొనుకున్నాడట. అయితే ఇది బాలయ్య కెరీర్ లో రికార్డు ఫిగర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ లుక్ కి వచ్చిన ఆదరణ వల్లే ఈ రేట్స్ కి అమ్ముడు పోయిందని తెలుస్తుంది. కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నయనతార, హరిప్రియ, నటాషాలు బాలయ్య సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో పూర్తి చేసుకుని హైదరాబాద్ లో ఇంకో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*