బాలయ్య స్టామినాకు తగ్గ సినిమా కాదు!

పోయిన ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల మధ్య ఎంత పోటీ ఉందొ…. అదేవిధంగా ఈ సంక్రాంతికి కూడా కచ్చితంగా పోటీ ఉంటుంది అనుకున్నారు అంత. కానీ అజ్ఞాతవాసి డిజాస్టర్ వల్ల ఈ పోటీ చప్పపడిపోయింది. విడుదల ఐన మూడు స్ట్రెయిట్ సినిమాలో బాలయ్య సినిమా జై సింహ పర్లేదు అనిపించుకుంది.

ఈ జైసింహ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయిపోయింది. ఇప్పటి దాకా 35.86 కోట్ల షేర్ తో సేఫ్ అనిపించాడు బాలయ్య. ఈ సినిమా బిజినెస్ ప్రకారం సుమారు 28 కోట్లకు అమ్ముడైంది. 8 కోట్ల లాభంతో మరోసారి బాలయ్య సెంటిమెంట్ వర్క్ అవుట్ అయింది.

కానీ ఇది బాలయ్య స్టామినాకి తగ్గ సినిమా కాదు. ఎందుకంటె గత ఏడాది గౌతమిపుత్ర శాతకర్ణి 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించి కొత్త రికార్డు సెట్ చేసింది. కానీ జై సింహ మాత్రం 36 కోట్ల మాత్రమే వసూల్ చేసింది. విన్నర్ అని చెప్పుకుంటున్న బాలయ్య స్టామినాకు తగ్గ సక్సెస్ మాత్రం జైసింహ ఇవ్వలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1