బాహుబలి రేంజ్ లో జై లవ కుశ

ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జై లవ కుశ. ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. ఎన్టీఆర్ కెరీర్ లో తొలిసారి ఈ చిత్రం లో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకే ఈ చిత్రాని కి ప్రేక్షకుల్లో అలాగే జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేసాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరగడంతో మొదటిరోజే ఓపెనింగ్స్ రూపంలో వీలైనంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టాలని చూస్తున్న మూవీ యూనిట్ గ్రాండ్ రిలీజ్ ని ప్లాన్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోనేకాక, ఓవర్సీస్, ఇతర ఏరియాల్లో అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలో జై లవ కుశ విడుదల కానుంది. రేపు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2400 ల పైగా స్క్రీన్లలో మార్నింగ్ షో పడనుంది. బాహుబలి-2 తర్వాత ఎక్కువ స్క్రీన్లలో రిలీజవుతున్న సినిమా ఇదే కావడం విశేషం.అలాగే ఈ చిత్రం రిలీజ్ అయిన కొన్ని రోజులకే మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ కూడా రిలీజ్ అవబోతుంది. సో స్పైడర్ రిలీజ్ అయ్యే లోపే జై లవ కుశ తో ఎన్టీఆర్ రికార్డ్స్ సెట్ చేసి టేబుల్ ప్రాఫిట్ జోన్ లోకి వెల్లిపోదాం అని ట్రై చేస్తున్నాడు.

మరి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అనుకున్నట్టుగా జై లవ కుశ చిత్రం ఈ ఒక్కవారంలోనే అనుకున్న కలెక్షన్స్ రాబడతాయా? అసలు ఈ చిత్రం 100 కోట్ల కలెక్షన్స్ కొల్ల గొడుతుందా? అనేది కేవలం బెన్ఫిట్ షో లకు అవిచ్చిన టాక్ టోన్ తెలిసిపోతుంది. జనతా గ్యారేజ్ లెక్క సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినాసరే జై లవ కుశ ఒక్క వారంలోనే కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి ఈ విషయం మరికొన్ని గంటల్లోనే తెలిసిపోనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*