బెబో సినిమా షూటింగ్స్ కి సిద్ధమైపోయింది

సహజంగా వివాహం అనంతరం కథానాయికలు వారి యాక్టింగ్ కెరీర్ కి స్వస్తి చెప్తుంటారు. రంగుల ప్రపంచానికి దూరంగా ఉండలేని భామలు కొంతమంది కథానాయిక పాత్రలు కాక ఇతర పాత్రలలో కనిపిస్తుంటారు. ఇక గర్భిణిగా బిడ్డని మోస్తున్న తరుణంలో కానీ, బిడ్డకి జన్మనిచ్చిన రెండు సంవత్సరాల పాటు కెమెరా ముందుకి రావటానికి అసలు ఇష్టపడరు. అంత కాలం గ్లామర్ ఫీల్డ్ లో రాజ్యం ఏలిన ఏ కథానాయికైనా బిడ్డకి జన్మనిచ్చే తరుణంలో బరువు పెరిగిన నాటి ఫోటోలని కూడా అభిమానులతో పంచుకోవటానికి ఇష్టపడరు. అయితే ఇవన్నీ తనకు వర్తించవు అని ఇప్పటికే చాటి చెప్పింది బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్.

గర్భిణిగా ఉండగానే వాణిజ్య ప్రకటనల్లో కనిపించి సంచలనం సృష్టించిన కరీనా కపూర్, గత ఏడాది డిసెంబర్ 20 న ఒక మెగా బిడ్డకు జన్మనిచ్చి తల్లి ఐన తరువాత రెండు నెలల లోపే ఒక బాలీవుడ్ ప్రైవేట్ పార్టీ కి హాజరై తన అందాలు ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తూ కెమెరాకి ఫోజులిచ్చింది కరీనా. ఇక ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న వీరే కి వెడ్డింగ్ చిత్రంలో ప్రధాన కథానాయిక పాత్రకి ఎంపికైన కరీనా కపూర్ ఇప్పటికే ఆ చిత్రానికి తగ్గట్టు తనని తాను సిద్ధం చేసుకుంది. తాజాగా కరీనా పోస్ట్ చేసిన తన హాట్ ఫోటో షూట్ ఇందుకు సాక్ష్యం. బ్లూ డేనీమ్స్ మరియు వైట్ ఇన్నర్ వేర్ కాస్ట్యూమ్స్ తో క్లివేజ్ షో తోపాటు, తన హాట్ స్టైలింగ్ ని ప్రదర్శిస్తూ కెమెరా ముందు దర్శనమిచ్చింది కరీనా కపూర్ ఖాన్. చూస్తుంటే ఒన్స్ బెబో ఫామ్లోకి వస్తే యువ కథానాయికలకు ధీటుగా మళ్లీ వరుస సినిమాలతో అలరించేలా కనిపిస్తోంది ఈ 36 సంవత్సరాల మధ్య వయసు అందాల తార.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*