భలే గాసిప్స్ పుట్టిస్తారండి!!

anasuya bharadwaj telugu post telugu news

తెలుగు యాంకర్లకు గ్లామర్ టచ్ ఇచ్చిన అనసూయ మాటలతో జనాల్ని ఇట్టే ఆకర్షించేస్తుంది. బుల్లితెరమీద అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న అనసూయ ఇప్పుడు వెండితెరమీద కూడా గ్లామర్ ఒలకబోస్తూ హొయలుపోతుంది. అసలు పెళ్ళై ఇద్దరు పిల్లకి తల్లైనా కూడా అనసూయ అందాలు ఏమాత్రం వన్నెతరగలేదంటే ఆమె ఎంతగా ఫిజిక్ ని మెయింటైన్ చేస్తుందో అర్ధమవుతుంది. కాని అనసూయ కి అనుకున్న అవకాశాలు మాత్రం వెండితెర మీద రావడంలేదు.

ఆమె హీరోయిన్ పాత్రలను ఆశించి హాట్ హాట్ గా రెచ్చిపోయి ఫోటో షూట్స్ గట్రా చేయించుకున్నా కూడా ఆమెకు అలాంటి అవకాశాలు రాలేదు సరికదా… ఐటెం సాంగ్ కి అవకాశం వచ్చింది. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ ‘రంగస్థలం’లో అనసూయ ఒక కీ రోల్ చేస్తుంది. కాకపోతే అనసూయకి హీరోయిన్ అవకాశాలు మాత్రం రావడంలేదు. అయితే అనసూయ లావుగా వుండడంవలనే ఆమెకి అవకాశాలు రావడంలేదని చిన్నగా ప్రచారం మొదలయ్యింది. అంతేనా ఆ లావు తగ్గించుకోవడానికి అనసూయ సర్జరీ వంటి ప్రయత్నాలు మొదలుపెట్టిందని కూడా గత రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

ఎంతో సెక్సీగా కనబడే అనసూయ నిజంగానే ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టిందని గాసిప్స్ బాగా స్ప్రెడ్ అవడంతో ఎట్టకేలకు ఈ గాసిప్స్ పై అనసూయ నోరు విప్పింది. నా గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ రాకపోతే ఎవ్వరికీ నిద్ర పట్టదు. అందుకే ఇపుడు ఈ సర్జరీ అనే రూమర్ క్రియేట్ చేశారు. అలాంటి సర్జరీ లాంటివి నేనేం చేయించుకోవడంలేదు. అదంతా ఒట్టి ట్రాష్ అని.. అలాంటి షార్ట్ కట్స్ పైన నాకెలాంటి నమ్మకం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*