మరో సినిమా కూడా సంక్రాంతి బరిలో…?

తెలుగు వారికీ మాత్రమే కాకుండా తమిళులు కు కూడా సంక్రాంతి కి వచ్చే సినిమాల మీద మహా ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు దర్శక నిర్మాతలు కూడా సంక్రాంతి సీజన్ నే ఎక్కువగా నమ్ముకుంటారు. ఎందుకంటే సినిమాలకు సంక్రాంతి సీజన్ అంటే కలిసొచ్చే కాలం. ఈ సంక్రాంతి సీజన్ లో హిట్ కొడితే బాక్సాఫీసు షేక్ అవ్వాల్సిందే. అందుకే హీరోలతో పాటే దర్శకనిర్మాతలు కూడా సంక్రాంతి బరిలోనే తమ తమ సినిమాల్తో పోటీ పడుతుంటారు. ఈ ఏడాది సంక్రాంతి రేసు రసవత్తరంగానే వుంది. అందులో అజ్ఞాతవాసితో పవన్ కళ్యాణ్ మొదటి కర్చీఫ్ వేస్తె…. జైసింహాతో బాలకృష్ణ రెండో కర్చీఫ్ వేసి బెర్త్ లు కన్ఫర్మ్ చేసేసారు.

రవితేజ… రాజ్ తరుణ్…

అలాగే.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రాజా తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగుల రాట్నం కూడా సంక్రాంతికే అంటున్నారు. మరోపక్క అనుష్క భాగమతి సంక్రాతి సీజన్ నే క్యాష్ చేసుకోవాలని ఆరాటపడుతుంది. ఇక ఇప్పుడు తాజాగా రాజాది గ్రేట్ తో గ్రేట్ సక్సెస్ అందుకున్న రవితేజ కూడా టచ్ చేసి చూసుకో సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ షూటింగ్ ఓ కొలిక్కొచ్చిన టచ్ చేసి చూడు మూవీని ఈ సీజన్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. రవితేజ గతంలోనూ కృష్ణ, మిరపకాయ్ చిత్రాలతో సంక్రాంతికే వచ్చి హిట్ అందుకున్నాడు. ఇక వీటితో పాటే రెండు తమిళ సినిమాలు కూడా తెలుగు సినిమాల్తో పోటీ పడడానికి రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి విశాల్ సినిమా కాగా మరొకటి సూర్య సినిమా. వీరిద్దరికి తెలుగులో మంచి మార్కెట్ వుంది. సో… దీనిబట్టి సంక్రాతి కి పందెం కోళ్లతోపాటే.. సినిమాలు చక చక రెడీ అవుతున్నాయన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1