మహేష్ ప్లాన్ మారిందా?

మహేష్ బాబు – కొరటాల కలయికలో రూపుదిద్దుకుంటున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ హిట్ కాంబినేషన్ పై అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం మహేష్ కూడా డే అండ్ నైట్ కష్టపడుతున్నాడనే టాక్ వినబడుతుంది. ప్రస్తుతానికి అమెరికాలో ఒక యాడ్ షూట్ లో పాల్గొంటున్న మహేష్ బాబు అది పూర్తవ్వగానే అట్నుంచి అటే… భరత్ అనే నేను షూటింగ్ లో జాయిన్ అవుతాడట. కేవలం రోజులో కొన్ని గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని కొరటాల షూట్ లో మహేష్ జాయిన్ అవుతాడని తెలుస్తుంది.

భరత్ అను నేను….

కొరటాల… భరత్ అనే నేను షూటింగ్ షెడ్యూల్ ని తమిళనాడులోని పొల్లాచ్చిలో జరపనున్నాడు. ఇక మహేష్ నేరుగా అక్కడికే షూటింగ్ స్పాట్ కి వెళ్లపోతాడట. అయితే మహేష్ భరత్ అనే నేను కోసం ఇంతలా కంగారు పడటానికి కారణం ఉందట. అదేమిటంటే మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ అదే డేట్ కి అల్లు అర్జున్ నా పేరు సూర్యని విడుదల కోసం బుక్ చేసుకున్నాడు. ఇప్పుడు కొత్తగా మహేష్ భరత్ ని దింపితే తామెందుకు తగ్గాలని నా పేరు సూర్య నిర్మాతలు భీష్మించుకుని కూర్చున్నారు.

జనవరిలో రిలీజ్ కు…

అందుకే మహేష్ కూడా వారితో గొడవెందుకులే అని.. తన సినిమాని కొంచెం ముందుగా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడట. అది కూడా జనవరిలో సంక్రాంతికి గాని లేదంటే రిపబ్లిక్ డే కి గాని అనే ప్రచారం మాత్రం మొదలైంది. సంక్రాంతి నాటికే భరత్ అను నేను సినిమాని విడుదల చేసేందుకు సాధ్యాసాధ్యలపై ఇప్పటికే దర్శకనిర్మాతలు, హీరో మధ్యన చర్చలు మొదలయయ్యనే టాక్ వినబడుతుంది. మాములుగా కొరటాల – మహేష్ సినిమా మొదలెట్టినప్పుడే ఈ సినిమాని సంక్రాతి బరిలో దింపాలనుకున్నారు. కానీ మహేష్ స్పైడర్ సినిమా షూటింగ్ ఆలస్యమవడంతో అంతా మారిపోయింది. అయితే అప్పుడు లేట్ అయితే అయ్యింది.. ఇప్పుడు స్పీడుగా షూటింగ్ ని ఫినిష్ చేద్దామని గ్యాప్ లేకుండా మహేష్ కూడా కొరటాల సినిమా డేట్స్ ఇచ్చేశాడట. అందుకే సినిమా జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావచ్చోచనే ఊహా గానాలు మొదలయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1