మహేష్ మాత్రం పవన్ విషయంలో తగ్గనంటున్నాడు!!

బిగ్ బాస్ సీజన్ వన్ ముందు వరకు కత్తి మహేష్ అంటే ఎవ్వరికి తెలియదు. కానీ బిగ్ బాస్ పుణ్యమా అని కత్తి గట్టిగా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ నుండి తొందరాగానే బయటపడ్డ కత్తి మహేష్… పవన్ మీద సెటైర్స్ వేసి మరి ఫ్రీగా పబ్లిసిటీ చేసుకున్నాడు. విషయం అర్ధంకాని పవన్ ఫాన్స్ కత్తిని గట్టిగా తగులుకుని ఫ్రీ గా జనాల నోళ్ళలో నానేలా చేశారు. ఆ రాద్ధాంతం ముగిసి ఏదో… రివ్యూలు రాసుకుంటూ బతికేస్తున్న కత్తి మహేష్ ఒక బిగ్ సెలెబ్రిటీ అవతారమెత్తాడు. ఏదో సినిమాలు చూసేసిన రివ్యూ ఇదే అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.

హైపర్ ఆదిపైనా…

మళ్ళీ తాజాగా జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్ లో ఆది మహేష్ మీద పంచ్ డైలాగ్స్ పేల్చాడు. అవి షోలో ఏ మేరకు వర్క్ అవుట్ అయ్యాయో తెలియదు గాని.. మళ్ళీ మహేష్ కత్తి అనూహ్యంగా లైన్ లోకొచ్చేసి జబర్దస్త్ మీద విరుచుకుపడ్డాడు. ఆది కి తన సెటైర్ వేసే అంత దమ్ము లేదని.. అసలు నా రూపాన్ని కామెంట్ చెయ్యడానికి ఆది ఎవరని.. ఆది వేసిన పంచ్ కి ఎవ్వరికి నవ్వురాలేదని మీడియాకెక్కాడు.

పవన్ ఏమైనా దేవుడా?

అంతటితో ఊరుకోకుండా ఒక ఛానల్ కి ఇచ్చిన స్పెషల్ ప్రోగ్రాంలో మరోసారి పవన్ ని తగులుకున్నాడు. అసలు పవన్ ఏమైనా దేవుడా అంటూ ప్రశ్నిస్తూ….. ఇలా అభిమానుల ఆగడాలు హద్దులు దాటుతుంటే ఆయన అలా మౌనంగా ఉండటం కరెక్ట్ కాదని…. ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలని పవన్ ని ఎద్దేవా చేసాడు. ఒకవేళ పవన్ గనక ఈ విషయమై స్పందిస్తే…. తాను ఇంకెప్పుడు ఏమి మాట్లాడనని…. పవన్ నే ఫాలో అయిపోతానని చెప్పి షాక్ ఇచ్చాడు. మరి పవన్ ఏమో మనకెందుకులే…. బురదలో రాయేస్తే మనకే అంటుకుంటుందని మౌనం వహిస్తాడు.

వదిలేలా లేడు….

కానీ కత్తి మహేష్ మాత్రం, పవన్ ని సామాన్యంగా వదిలేలా కనబడం లేదు. అందుకే పనిగట్టుకుని అక్కర్లేని చర్చ కార్యక్రమంలో కూర్చుని ఇలా మళ్ళీ పవన్ ని తగులుకుని మరోసారి పవన్ ఫాన్స్ కి టార్గెట్ అయ్యాడు. మరి ఈ విషయంలో పవన్ ఫాన్స్ మరోసారి స్పందించారు అంటే… మహేష్ కత్తి పని అవుట్ అంటున్నారు కొందరు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1