మామ వల్లనే… పైకి రాలేదు!

ఒక్క తమిళనాట మాత్రమే సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఆయనకు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. రజినీకాంత్ చేసే సినిమాల్లో ఆయన స్టయిల్ ని ఇష్టపడని వారుండరు. ఆయనకున్న క్రేజ్ సౌత్ లో మరే స్టార్ హీరోకి లేదనడంలో అతిశయోక్తిలేదు. మరి అలాంటి సూపర్ స్టార్ మీద ఆయన అల్లుడు ధనుష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ధనుష్ విఐపి 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ కామెంట్స్ చేసాడు. తన కుటంబ పరిస్థితి గురించి…. అలాగే ఒకప్పుడు తాను అనుభవించిన మానసిక వేదన గురించి ధనుష్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

నేను కోలీవుడ్ లో హీరోగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి అల్లుడు అవ్వడం వల్లనే ధనుష్ ఈ స్థాయికి ఎదిగాడనే మాటలు విన్నప్పుడు చాలా బాధగా ఉండేదని…. లోలోపల చాలా మానసిక క్షోభను అనుభవించేవాడినని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా అప్పట్లో తన హావభావాలు కూడా చూసి చాలా మంది హేళన చేశారని చెప్పాడు. అందుకే తనకో గుర్తింపు రావాలని…. తన అన్నయ్య సెల్వా రాఘవన్ డైరెక్షన్ లో కొన్ని ప్రయోగాత్మకమైన చిత్రాలు చేసి.. పేరు తెచ్చుకున్నానని చెప్పుకొచ్చాడు.

ఇక తన అన్న డైరెక్షన్ లోనే కాదు వరుస సినిమాలు హిట్ అవడంతో ధనుష్ కి మంచి పేరొచ్చింది. అలాగే స్టార్ హీరో హోదా కూడా వచ్చేసింది. ఇక హీరో అవ్వడానికి కలర్, బాడీ అవసరం లేదని నిరూపించాడు ఈ హీరో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*