మావయ్య నా, తేజు నా ?

మెగా ఫ్యామిలీ లో ఒక్కొక్కరిది ఒక్కొక స్టైల్. అలానే సాయి ధరమ్ తేజ్ కూడా తన మావయ్య సాంగ్స్ తీసుకుని రీమేక్ చేసి మెగా ఫామిలీ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు. తేజు చేసిన దాదాపు ప్రతి సినిమాలో చిరంజీవి సాంగ్స్ రీమేక్ చేస్తున్నాడు. తన లేటెస్ట్ మూవీ ఇంటిలిజెంట్ లో కూడా కొండవీటిదొంగ సినిమాలోని ఛమక్ ఛమక్ ఛాం పట్టుకో పట్టుకో సాంగ్ ను మెగా అభిమానులకు మరోసారి గుర్తు చేస్తున్నాడు.

ఛమక్ ఛమక్ ఛాం పట్టుకో పట్టుకో సాంగ్ మెలోడీ కాబట్టి అందులో చిరంజీవి స్టెప్స్ కూడా చాల సింపుల్ గా ఉంటాయి. అప్పట్లో విజయ శాంతి – చిరంజీవిలది హిట్ కాంబినేషన్ కాబట్టి ఈ సాంగ్ అప్పట్లో ట్రెండ్ సృష్టించింది. బీట్ తగ్గట్టు సింపుల్ స్టెప్స్ తో చిరు – విజయశాంతి అదరకొటేస్తారు. అయితే ఇప్పుడు తేజు – లావణ్య త్రిపాఠితో కలిసి స్టెప్పులు కలిపాడు. ఇందులో తేజు స్టయిలిష్ లుక్స్ తో ఫ్యాన్స్ ను కట్టిపడేశాడు. ఇందులో స్టెప్పులు అవలీలగా చేసేశాడు. దాదాపుగా చిరు మ్యానరిజమ్స్ ను అనుసరిస్తూ అభిమానులను బాగానే అట్రాక్ట్ చేశాడు.

దీనికితోడు ఈ సాంగ్ ను ఫారిన్ లో చిత్రీకరించారు. లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా వున్నాయి. లేటెస్ట్ గ విడుదలైన ఈ సాంగ్ ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. ఈ సాంగ్ ను బాగా రీమేక్ చేసారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సాంగ్ తర్వాత తేజు ఏ సాంగ్ చేస్తాడో అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*